+91 99635 77856

ఫోటో ఎక్స్పోకు బయలుదేరిన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు

Kudikala Sai Editor
maaksharamnews.in

ఫోటో ఎక్స్పోకు బయలుదేరిన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు

హుజురాబాద్/సెప్టెంబర్ 20 (మా అక్షరం): హైదరాబాద్‌లో జరగనున్న ఫోటో ఎక్స్పోలో పాల్గొనేందుకు హుజురాబాద్, జమ్మికుంట మండల ఫోటో ,వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో బయలుదేరారు.ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల తిరుపతి, మండల అధ్యక్షుడు కొలుగూరి కిరణ్, సీనియర్ నాయకుడు సొల్లు బాబు, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్ జెండా ఊపి బృందాన్ని పంపించారు.ఫోటోగ్రాఫర్లు ప్రతి ఒక్కరి జీవితంలోని శుభకార్యాలను కెమెరాల్లో బంధించి చిరస్మరణీయంగా నిలుపుతారని, వారి పాత్ర సమాజంలో ఎంతో ముఖ్యమని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఫోటో ఎక్స్పోలో కొత్త కెమెరాలను ఆవిష్కరించడంతో పాటు సరికొత్త సాంకేతిక మెలకువలను పరిచయం చేస్తారని, హుజురాబాద్ నుంచి బయలుదేరిన సభ్యులు వాటిని నేర్చుకుని మరింత రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్, జమ్మికుంట మండల ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !