ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13 వ వర్ధంతి వేడుకలు
హుజురాబాద్ /సెప్టెంబర్ 21(మా అక్షరం): ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి వేడుకల సందర్భంగా ఆదివారం చేనేత సహకార సంఘ కార్యాలయంలో సంఘం ఇంచార్జి ఎలిగేటి ఉపేందర్ కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చేనేత ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం 1952 లో హైకోను ఏర్పాటు చేశారని, ఇతర వృత్తుల వారిని కూడా సహకార రంగ పరిధిలోకి తెచ్చారని ఇలాంటి ఎన్నో పద్మశాలీలకు తన వంతు సేవ చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండేటి మహదేవ్ చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 237











