+91 99635 77856

కమ్యూనిటీ హాల్,కబరిస్తాన్ ప్రహరీ గోడ కోసం నిధులు మంజూరు

– ప్రహరీ,కమ్యూనిటీ హాల్ కోసం అనేక పార్టీలకి చెందిన నాయకులకు వినతులు…
– నిధులు మంజూరు చేపించిన ప్రణవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మైనార్టీ సోదరులు…

హుజరాబాద్/సెప్టెంబర్ 23(మా అక్షరం): కాంగ్రెస్ పరిపాలనలో ఏళ్లుగా పరిష్కారం కానీ సమస్యలకు పరిష్కారం చూపెడుతుందని ఇది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని మైనార్టీ నాయకులు తెలిపారు.మంగళవారం హుజురాబాద్ మండల పరిధిలోని పెద్దపాపయ్యపల్లి,కందుగుల గ్రామాల్లో కమ్యూనిటీ హాల్,కబరిస్తాన్ ప్రహరీ గోడ కోసం ఎస్డిఎఫ్ నిధుల నుండి పదిహేను లక్షల రూపాయలను కేటాయించడం జరిగిందని,అనేక సంవత్సరాలుగా ఈ విషయమై అన్ని పార్టీల నాయకులను అడిగగా చేస్తాం చూస్తాం అని మాట చెప్పడమే తప్ప చేసింది లేదని,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణవ్ నాయకత్వంలో ఈ విషయం దృష్టికి తీసుకురాగా హామీ ఇవ్వగా ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేపించారని,దీని పట్ల ప్రణవ్ కు,మంత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి,ప్రణవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు.ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా మైనార్టీ సోదరులు,నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !