+91 99635 77856

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

Kudikala Sai Editor
maaksharamnews.in

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
-తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం బతుకమ్మ..
- తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ..
- పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ..
హుజురాబాద్/ సెప్టెంబర్ 29( మా అక్షరం):
ప్రకృతిని ఆరాధిస్తూ పువ్వులను పూజిస్తూ, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగ, తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం, ఆడపడుచులు పూలను పూజిస్తూ గౌరమ్మని ఆరాధిస్తూ,ఆనంద ఉత్సవాలతో హుజురాబాద్ పట్టణంలోని బతుకమ్మ సౌవళ్ల  సోమవారం చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.మహిళలు పిల్లలు ఒకరోజు ముందు నుండి రంగురంగుల పూలను తెచ్చి పోటా పోటీగా బతుకమ్మను తీరొక్కపూలతో పేర్చారు, హరివిల్లు కంటే అందంగా బతుకమ్మను పేర్చి, గౌరమ్మకు ఐదు రకాల నైవేద్యాలు సమర్పించారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాన్ని అద్దం పట్టే విధంగా ఆడపడుచులందరూ బతుకమ్మను ఒకచోట పెట్టి ఆటపాటలతో కోలాటాలతో ఆనందోత్సవాలతో మరింత ఉత్సాహం బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.అనంతరం బతుకమ్మ తో పాటు గౌరమ్మని ఉంచి, గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసి వీడ్కోలు పలికారు, ఇస్తినమ్మ వాయనం,పుచ్చుకున్నానమ్మా వాయినం అంటూ అమ్మవారి ప్రసాదాలు ఒకరికొకరు పంచుకున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
-తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం బతుకమ్మ..
– తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ..
– పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ..
హుజురాబాద్/ సెప్టెంబర్ 29( మా అక్షరం):
ప్రకృతిని ఆరాధిస్తూ పువ్వులను పూజిస్తూ, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగ, తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం, ఆడపడుచులు పూలను పూజిస్తూ గౌరమ్మని ఆరాధిస్తూ,ఆనంద ఉత్సవాలతో హుజురాబాద్ పట్టణంలోని బతుకమ్మ సౌవళ్ల  సోమవారం చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.మహిళలు పిల్లలు ఒకరోజు ముందు నుండి రంగురంగుల పూలను తెచ్చి పోటా పోటీగా బతుకమ్మను తీరొక్కపూలతో పేర్చారు, హరివిల్లు కంటే అందంగా బతుకమ్మను పేర్చి, గౌరమ్మకు ఐదు రకాల నైవేద్యాలు సమర్పించారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాన్ని అద్దం పట్టే విధంగా ఆడపడుచులందరూ బతుకమ్మను ఒకచోట పెట్టి ఆటపాటలతో కోలాటాలతో ఆనందోత్సవాలతో మరింత ఉత్సాహం బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.అనంతరం బతుకమ్మ తో పాటు గౌరమ్మని ఉంచి, గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసి వీడ్కోలు పలికారు, ఇస్తినమ్మ వాయనం,పుచ్చుకున్నానమ్మా వాయినం అంటూ అమ్మవారి ప్రసాదాలు ఒకరికొకరు పంచుకున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !