-కెసిఆర్ రైతులను గుండెల్లో పెట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం గుండెల మీద తన్నింది..
-హుజురాబాద్ గడ్డ బిఆర్ఎస్ అడ్డా…
– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…
హుజురాబాద్ /అక్టోబర్ 04 (మా అక్షరం): రానున్న ఎంపీటీసీ, జడ్పిటిసి గ్రామపంచాయతీ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి విజయాన్ని సాధించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం పట్టణం లోని ఎస్సార్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజుగా చేయాలని తపనతో రైతులను గుండెల్లో పెట్టుకొని చూసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాపాడుకున్నాడని అన్నారు. కెసిఆర్ రైతులను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రైతులను గుండెల మీద తన్నిందని ఆయన అన్నారు. నాటు వేసుకున్న రైతులు వ్యవసాయ క్షేత్రం వద్ద పనులు చేసుకోవాల్సింది ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థతతో యూరియా కేంద్రాల ముందు రోడ్ల పైన చెప్పులు కట్టే దుస్థితికి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం కెసిఆర్ వందల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గం లో కనీసం తట్టెడు మన్ను కూడా పోయలేదని అన్నారు.తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలతో 420 మోసపు హామీలు ఇచ్చి 420 ప్రభుత్వంగా ప్రజల ముందు నిలిచిందని అన్నారు. ముఖ్యంగా రైతుల విషయంలో మరి దారుణంగా తయారైందని 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని, రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని, రైతుబంధు రైతు బీమా విషయంలోనూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. హుజురాబాద్ గడ్డ ముమ్మాటికి బిఆర్ఎస్ అడ్డా అని ఇక్కడ ఏ ఎన్నిక వచ్చిన బిఆర్ఎస్ గెలుపు తధ్యమని అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పిటిసి లతోపాటు మున్సిపల్ ఎన్నికల్లోను హుజురాబాద్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ జండా ఎగరవేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి శ్యాంసుందర్ రెడ్డి మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు రామారావు, పోరెడ్డి కిషన్ రెడ్డి లతోపాటు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











