+91 99635 77856

మాజీ జెడ్పీటీసీ పడిదం బక్కారెడ్డికి ప్రముఖుల నివాళులు

Kudikala Sai Editor
maaksharamnews.in

మాజీ జెడ్పీటీసీ పడిదం బక్కారెడ్డికి ప్రముఖుల నివాళులు

హుజూరాబాద్/ అక్టోబర్ 05(మా అక్షరం):మాజీ జెడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి మృతికి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. బక్కారెడ్డి పార్థివదేహాన్ని చూడటానికి ఆయన స్వగ్రామమైన కందుగుల గ్రామానికి ఆదివారం పెద్ద సంఖ్యలో ప్రముఖులు తరలివచ్చారు. పార్థివదేహానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు.బక్కారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన వారిలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మికాంతరావు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ సరోజనిదేవి తదితరులు ఉన్నారు.స్థానిక ప్రజలు, అనుచరులు పెద్ద ఎత్తున హాజరై బక్కారెడ్డి అంతిమ యాత్రలో పాల్గొని ఆయనకు ఘనంగా చివరి వీడ్కోలు పలికారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !