+91 99635 77856

నాకోసం కష్టపడ్డారు… ఇప్పుడు మీకోసం కష్టపడతా

-యూరియా అందించని ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు..
-కమలాపూర్ గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తాం..
-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…
హుజురాబాద్/ అక్టోబర్ 16 (మా అక్షరం): అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకోసం కష్టపడి గెలిపించిన కార్యకర్తలు, నాయకులకు ఇప్పుడు తాను అండగా నిలబడి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారిని గెలిపించేందుకు కష్టపడతానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు.సోమవారం కమలాపూర్ పట్టణంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ వందల కోట్లు వెచ్చించారని గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్కదాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదని తెలిపారు. రైతులు యూరియా కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతుండగా, యూరియా అందించని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కే లేదని స్పష్టం చేశారు.ప్రజలతో మమేకమై, వారి విశ్వాసం గెలుచుకున్న వారికి మాత్రమే టికెట్లు కేటాయిస్తామని అన్నారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధంగానే ఉందని, హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధిక సీట్లు గెలిపించి కేసీఆర్ కి కానుకగా అందిస్తామన్నారు.బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో వర్గ రాజకీయాలు ముదిరిపోయాయని, కానీ బీఆర్‌ఎస్‌లో మాత్రం ఒక్కటే వర్గం “కేసీఆర్ వర్గం” అని స్పష్టం చేశారు.రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా హుజురాబాద్ నియోజకవర్గం మొత్తం మీద గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 9 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.అదే సమయంలో, ఉప్పల్ గ్రామం రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు పూర్తిచేసినా, మధ్యలో కేంద్ర ప్రభుత్వం పనులు నిలిపివేసిందని విమర్శించారు. ప్రస్తుత రహదారిపై ఏర్పడిన గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సంపత్ రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, మాజీ జడ్పీటీసీలు లక్ష్మణరావు, నవీన్, సీనియర్ నాయకులు సత్యనారాయణ రావు, తిరుపతి రావు, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణ చైతన్య, సమన్వయ కమిటీ సభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !