+91 99635 77856

30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి.

Kudikala Sai Editor
maaksharamnews.in

30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి.

-తాహసిల్దార్ కనకయ్య...

హుజురాబాద్/ అక్టోబర్ 08 (మా అక్షరం):పౌరులు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో తప్పనిసరిగా అందించాలని తహసిల్దార్ కనకయ్య స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం పొందడం ప్రతి భారతీయ పౌరుడికి రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కు అని ఆయన పేర్కొన్నారు.సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ గూడూరు స్వామి రెడ్డి అధ్యక్షత వహించారు. సదస్సులో విద్యార్థులు, పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కనకయ్య మాట్లాడుతూ... “పౌరులు అడిగిన సమాచారాన్ని 30 రోజుల్లో అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే. ఈ వ్యవధిలో ఇవ్వడంలో విఫలమైతే, వారు రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ ముందు బాధ్యత వహించాల్సి వస్తుంది,” అని హెచ్చరించారు. సమాచార హక్కు చట్టం 2005 సంవత్సరం నుంచి అమల్లో ఉందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ రెడ్డి, అధ్యాపకులు కొలిపాక రమేష్, మేకల నవీన్‌కుమార్, స్వప్న, యాల ముత్యంరెడ్డి, అనిల్ కుమార్, మూగల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-తాహసిల్దార్ కనకయ్య…

హుజురాబాద్/ అక్టోబర్ 08 (మా అక్షరం):పౌరులు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో తప్పనిసరిగా అందించాలని తహసిల్దార్ కనకయ్య స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం పొందడం ప్రతి భారతీయ పౌరుడికి రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కు అని ఆయన పేర్కొన్నారు.సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ గూడూరు స్వామి రెడ్డి అధ్యక్షత వహించారు. సదస్సులో విద్యార్థులు, పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కనకయ్య మాట్లాడుతూ… “పౌరులు అడిగిన సమాచారాన్ని 30 రోజుల్లో అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే. ఈ వ్యవధిలో ఇవ్వడంలో విఫలమైతే, వారు రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ ముందు బాధ్యత వహించాల్సి వస్తుంది,” అని హెచ్చరించారు. సమాచార హక్కు చట్టం 2005 సంవత్సరం నుంచి అమల్లో ఉందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ రెడ్డి, అధ్యాపకులు కొలిపాక రమేష్, మేకల నవీన్‌కుమార్, స్వప్న, యాల ముత్యంరెడ్డి, అనిల్ కుమార్, మూగల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !