+91 99635 77856

బీసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు

Kudikala Sai Editor
maaksharamnews.in

బీసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు

-బీసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు...
-కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్...
హుజురాబాద్ /అక్టోబర్ 17(మా అక్షరం): రేపు బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్ కు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ తరుపున మద్దతు తెలుపుతున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లేరేషన్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం అమలు చేసేందుకు ప్రభుత్వం తరపున అన్ని పూర్తి చేశామని,ఈ మేరకు ప్రభుత్వం ఇంటింటి కులగణన సర్వేను పక్కగా చేశామని,అనంతరం శాసనసభలో బీసీ బిల్లులను ఆమోదించామని,లోకల్ బాడీ ఎన్నికల్లో వాటిని అమలు చేసేందుకు ప్రత్యేక జీవో కూడా విడుదల చేశామని అన్నారు.కేంద్ర ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే గవర్నర్,రాష్ట్రపతి దగ్గరికి పంపిన బీసీ బిల్లులను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి,ప్రభుత్వానికి మాత్రమే ఉందని దానికోసం కోర్టులో కూడా బలమైన వాదనలు వినిపించామనీ అన్నారు.

Share ePaper Clip

Preparing image...

-బీసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు…
-కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్…
హుజురాబాద్ /అక్టోబర్ 17(మా అక్షరం): రేపు బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్ కు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ తరుపున మద్దతు తెలుపుతున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లేరేషన్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం అమలు చేసేందుకు ప్రభుత్వం తరపున అన్ని పూర్తి చేశామని,ఈ మేరకు ప్రభుత్వం ఇంటింటి కులగణన సర్వేను పక్కగా చేశామని,అనంతరం శాసనసభలో బీసీ బిల్లులను ఆమోదించామని,లోకల్ బాడీ ఎన్నికల్లో వాటిని అమలు చేసేందుకు ప్రత్యేక జీవో కూడా విడుదల చేశామని అన్నారు.కేంద్ర ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే గవర్నర్,రాష్ట్రపతి దగ్గరికి పంపిన బీసీ బిల్లులను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి,ప్రభుత్వానికి మాత్రమే ఉందని దానికోసం కోర్టులో కూడా బలమైన వాదనలు వినిపించామనీ అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !