+91 99635 77856

చీఫ్ జస్టిస్‌ గవాయ్‌పై దాడిని ఖండించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
-దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌…
హుజూరాబాద్‌/ అక్టోబర్‌ 17 (మా అక్షరం):
సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌ పై జరిగిన దాడిని ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ ఘటనపై నిందితుడు రాకేష్‌ కిషోర్‌పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో కనుకయ్యకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…అక్టోబర్‌ 7న సుప్రీం కోర్టులో వాదనలు వింటున్న సమయంలో రాకేష్‌ కిషోర్‌ చీఫ్‌ జస్టిస్‌ గవాయ్‌ పై షూస్‌ విసరడం అత్యంత అనాగరికమని పేర్కొన్నారు. ఈ దాడి ప్రజాస్వామ్య స్ఫూర్తి, భారత రాజ్యాంగంపై దాడిగానే పరిగణించాల్సిందిగా అన్నారు.
దళితుడైన బి.ఆర్‌. గవాయ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం కొందరు ఆధిపత్యవాద శక్తులు జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రజాస్వామిక దృక్పథం కలిగిన రిటైర్డు జడ్జిలతో స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రుద్రారపు రాంచంద్రం,మారపేల్లి శ్రీనివాస్‌,రొంటాల రాజుకుమార్‌, మొలుగూరి ప్రభాకర్‌, దేవసాని ప్రియదర్శిని,ముక్క రమేష్‌, వెల్పుల విజయ్‌,మాడుగుల ఓదెలు,మొలుగు శ్రీనివాస్,మంద రాజు,తునికి వసంత్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !