హుజురాబాద్/అక్టోబర్ 17(మా అక్షరం): ఆధునిక వైద్యంలో కీలక పాత్ర వహించే అనస్తీషియా (మత్తు వైద్యం) ప్రాధాన్యతను వివరిస్తూ, హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో గురువారం ‘ప్రపంచ అనస్తీషియా దినోత్సవం’ను అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వాతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా అనస్తీషియా ఆవిష్కరణ చరిత్రను, వైద్యంలో మత్తు డాక్టర్ల పాత్రను వివరిస్తూ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శస్త్ర చికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడడంలో అనస్తీషియా నిపుణుల సేవలను పలువురు కొనియాడారు.అనంతరం, హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ (మత్తు డాక్టర్) డాక్టర్ నారాయణ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఆయన వైద్య సేవలకు, ఆసుపత్రి అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ సన్మానం జరిగింది.ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ… ప్రపంచ అనస్తీషియా దినోత్సవం యొక్క చారిత్రక నేపథ్యాన్ని, ఈ వైద్య విధానం ఆవిష్కరణ తర్వాత శస్త్రచికిత్సల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించారు. “అనస్తీషియా అనేది కేవలం నొప్పిని తెలియకుండా చేయడమే కాదు, క్లిష్టమైన ఆపరేషన్లలో రోగి యొక్క ప్రాణాలను కాపాడే శక్తివంతమైన సాధన ఆన్నారు. మత్తు డాక్టర్లు కేవలం ఆపరేషన్ థియేటర్‌కే పరిమితం కాకుండా ఐసీయూ, అత్యవసర విభాగాల్లోనూ క్రిటికల్ కేర్ సేవలు అందిస్తారు,” అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సోమశేఖర్, ఉమా, గ్లోరీనా, రెజీయన, జ్యోతి, సునీత, శివ, స్రవంతి తదితర వైద్య సిబ్బంది, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.











