+91 99635 77856

దీపావళి పండుగ రోజు పలు జాగ్రత్తలు వహించాలి

-దీపావళి పండుగ రోజు పలు జాగ్రత్తలు వహించాలి…
-రాష్ట్ర 108 ప్రాజెక్ట్ సీఈఓ సుధాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్, జిల్లా కోఆర్డినేటర్ ఇమ్రాన్…
హుజురాబాద్/ అక్టోబర్ 19( మా అక్షరం): దీపావళి పర్వదినం సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నిర్లక్ష్యం కారణంగా పండుగ వేల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలంగాణ 108 ప్రాజెక్ట్ సీఈవో సుధాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్ జిల్లా కోఆర్డినేటర్ ఇమ్రాన్ హెచ్చరించారు.ఈ సందర్భంగా 108 ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రమాద నివారణ చర్యలు ముందస్తు జాగ్రత్తలను వివరించారు.

దీపావళి పండుగ సమయంలో అత్యవసర కేసులు 5 శాతం నుండి 10 శాతం వరకు పెరికే అవకాశం ఉందని 108 అంచనా వేసిందని, ముఖ్యంగా వాహన సంబంధిత గాయాలు వాహనేతర గాయాలు కాలిన గాయాలు, విషపూరిత విష శాస్త్ర సంబంధిత కేసులు ప్రధానంగా జరిగే అవకాశం ఉందని తెలిపారు. సగటు కంటే రోడ్డు ప్రమాదాలు రోజుకు 258 వరకు పెరిగే అవకాశం ఉందని రోజుకు 256నుండి300 పైగా ప్రమాదాలు కేవలం మద్యం సేవించి వాహనాలు నడపడం వలన మాత్రమే జరుగుతున్నాయని వెల్లడించారు. శరీరక దాడులు విద్యుత్ షాక్ లు వంటి వాహనేతర గాయాల కేసులు సగటున 170 నుండి 200 కి పైగా పెరగవచ్చు అని పటాకుల వల్ల కలిగిన గాయాలు, విషపూరిత సంబంధిత కేసులు 120 నుండి 150 కి పైగా పెరిగే అవకాశం ఉందన్నారు. పటాకులను సరైన విధంగా నిర్వహించకపోవడం వల్ల అలర్జీ కేసుల సంఖ్య కూడా పెరగవచ్చని ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు గుండె వ్యాధులతో బాధపడుతున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. టపాసులు ఇంటికి దూరంగా ఆరుబయట పేల్చాలని అధిక ధ్వని వచ్చే టపాసులు కాల్చకపోవడం శ్రేయస్కారమని వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించాలన్నారు. కాళ్లకు తప్పనిసరిగా చెప్పులు చిన్నపిల్లలు టపాసులు పేల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండాలని చేతుల్లో టపాసులు పేల్చకూడదని కంటి అద్దాలు మాస్క్ ధరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదని విందులు ఏర్పాటు చేసేవారు క్యాబులు బుక్ చేసుకోవాలని గతంలో ఈ విషయాన్ని పట్టించుకోని అనేకమంది ఈ దీపావళికి మనతో లేరని సీఈవో భావోద్వేగంతో హెచ్చరించారు. కాలిన గాయాలపై 10 నుండి 20 నిమిషాల వరకు సాధారణ చల్లని నీరు పోయాలని శుభ్రమైన గుడ్డతో గాయాలను కప్పి ఉంచాలని కొబ్బరినూనె, సిర లాంటివి పూయకూడదని వైద్యుల సలహా మేరకే ఆయింట్మెంట్ వాడాలని సూచించారు. 108 అత్యవసర స్పందన బృందం రాష్ట్రవ్యాప్తంగా హాట్ స్పాట్ ప్రాంతాల్లో 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే 108 కి కాల్ చేయాలని వారు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !