+91 99635 77856

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీ

Kudikala Sai Editor
maaksharamnews.in

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీ

హుజురాబాద్/ అక్టోబర్ 28 (మా అక్షరం):పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సబ్‌ డివిజన్‌ పరిధిలో సోమవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్ ఏసీపీ మాధవి పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.హుజురాబాద్ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రాజపల్లి మీదుగా తిరిగి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ముగిసింది.ఈ కార్యక్రమంలో సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీస్‌ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఏసీపీ మాధవి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని తప్పనిసరిగా చేసుకోవాలని, వ్యాయామం ద్వారా అనేక రుగ్మతలను దూరం పెట్టుకోవచ్చని సూచించారు.అలాగే ఈ నెల 30న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. రక్తదానంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పోలీసు అమరవీరులకు నిజమైన నివాళి అర్పించాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సీఐ కరుణాకర్, రూరల్‌ సీఐ పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట సీఐ రామకృష్ణ, రూరల్‌ సీఐ లక్ష్మీనారాయణ, హుజురాబాద్ ఎస్సై యూనస్ అహ్మద్ అలీ, సైదాపూర్ ఎస్సై తిరుపతి, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ అక్టోబర్ 28 (మా అక్షరం):పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సబ్‌ డివిజన్‌ పరిధిలో సోమవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్ ఏసీపీ మాధవి పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.హుజురాబాద్ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రాజపల్లి మీదుగా తిరిగి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ముగిసింది.ఈ కార్యక్రమంలో సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీస్‌ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఏసీపీ మాధవి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని తప్పనిసరిగా చేసుకోవాలని, వ్యాయామం ద్వారా అనేక రుగ్మతలను దూరం పెట్టుకోవచ్చని సూచించారు.అలాగే ఈ నెల 30న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. రక్తదానంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పోలీసు అమరవీరులకు నిజమైన నివాళి అర్పించాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సీఐ కరుణాకర్, రూరల్‌ సీఐ పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట సీఐ రామకృష్ణ, రూరల్‌ సీఐ లక్ష్మీనారాయణ, హుజురాబాద్ ఎస్సై యూనస్ అహ్మద్ అలీ, సైదాపూర్ ఎస్సై తిరుపతి, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !