+91 99635 77856

శ్రీ వర్షిత ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే

-శ్రీ వర్షిత ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే…
-జేఏసీ చైర్మన్ చెన్నమల్ల చైతన్య…

హుజురాబాద్ /అక్టోబర్ 28 (మా అక్షరం): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గురుకులంలో 10వ తరగతి చదువుతున్న శ్రీవర్షిత ఉరి వేసుకుని చనిపోవడం జరిగిందని, ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం తోపాటు ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యే నని శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జేఏసీ చైర్మన్ చెన్నమల్ల చైతన్య ఆరోపించారు.మంగళవారం ఆయన పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ .. శ్రీ వర్షిత ఆత్మహత్యకు పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది తక్షణమే బాధ్యత వహించాలని ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని సిబ్బంది కూడా మేమో జారీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విద్యార్థి సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు.ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని మా తరఫున హెచ్చరిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్న కనీసం విద్యాశాఖ పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఇంతవరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటని, తక్షణమే విద్యాశాఖ మంత్రిని కేటాయించి గురుకులాల్లో మౌలిక సదుపాయాలను వెంటనే పునర్నిర్మాణం చేయాలని అన్నారు.డార్మెంటరీ రూమ్స్ అన్ని చేంజ్ చేసి తక్షణమే విద్యా రంగానికి బడ్జెట్ ప్రవేశపెట్టి నూతన హాస్టల్స్ భవనాలను నిర్మించాలని కోరారు. విద్యాశాఖ పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఓసి లలో ఉన్నటువంటి పేద కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించ కూడదనే ప్రభుత్వం భావిస్తుందన్నారు. చదువుకుంటే ప్రశ్నించేతత్వం ఏర్పడుతుందని అతి చిన్న వయసులోనే చాలామంది విద్యార్థులను బలిగొంటున్నరని,ఇలాంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడన్నా పునరావృతం అయితే మాత్రం దీనికి రాబోయే రోజులలో విద్యార్థి లోకం కన్నెర్ర చేస్తుందని హెచ్చరించారు. అన్ని విద్యార్థి సంఘాలు కూడా మీ ప్రభుత్వం చేసేటువంటి అరాచకత్వాలను ఎండగట్టుదాయని అన్నారు.ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ జేఏసీ నాయకులు అరుణ్ కుమార్, కొండపాక రాకేష్ ,బండ అశోక్, సురేష్ ,విక్రమ్ ,వినయ్ మనోహర్ ,తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !