+91 99635 77856

ఢిల్లీలో రాజ్యాంగ హక్కుల సాధన సభకు హాజరు కావాలి..

Kudikala Sai Editor
maaksharamnews.in

ఢిల్లీలో రాజ్యాంగ హక్కుల సాధన సభకు హాజరు కావాలి..

-ఢిల్లీలో రాజ్యాంగ హక్కుల సాధన సభకు హాజరు కావాలి...
-మాల మహానాడు పిలుపు...
​ హుజురాబాద్/ నవంబర్ 07(మా అక్షరం):
ఈనెల 26న ఢిల్లీలో నిర్వహించనున్న రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా తలపెట్టిన రాజ్యాంగ హక్కుల సాధన సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని మాల మహానాడు నాయకులు తొగరు స్వామి పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన కరపత్రాన్ని శుక్ర వారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.​అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత పార్లమెంటుకు డా. బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలని, జాతీయ స్థాయిలో మాల-మహర్ అనుబంధ కులాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
​శాస్త్రీయమైన లెక్కలు లేకుండా చేసిన ఎస్సీ వర్గీకరణ రోస్టర్ జీవో 99, జీవో 29 రాజ్యాంగ వ్యతిరేకమని, వీటిని తక్షణమే పునఃసమీక్షించాలని నిరసన తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు.​ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని,​ఎస్సీ రిజర్వేషన్ల శాతాన్ని 15 శాతం నుండి 20 శాతానికి పెంచాలన్నారు.​దళితులపై దాడులు అరికట్టి, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని (అట్రాసిటీ చట్టం) పకడ్బందీగా అమలు చేయాలని,న్యాయస్థానాల్లో, రాజ్యసభలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.​కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను ముద్రించాలన్నారు.​ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల సహకారాలు అందించాలని పేర్కొన్నారు.​రాజ్యాంగ పీఠికను ప్రేయర్లలో తప్పకుండా చదివేలా ఏర్పాటు చేయాలని తెలిపారు.​ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు జూపాక శ్రీనివాస్, సొల్లు బాబు, బత్తుల సమ్మయ్య, డాక్టర్ రమేష్, కత్తరమళ్ళ సదానందం, సొల్లు దశరథం, కోడం నరసింగం, జూపాక నరసింగం తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

-ఢిల్లీలో రాజ్యాంగ హక్కుల సాధన సభకు హాజరు కావాలి…
-మాల మహానాడు పిలుపు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !