+91 99635 77856

పట్టణంలో పోలీసుల విస్తృత తనిఖీలు

Kudikala Sai Editor
maaksharamnews.in

పట్టణంలో పోలీసుల విస్తృత తనిఖీలు

హుజురాబాద్/ నవంబర్11(మా అక్షరం): సీపీ గౌస్ ఆలాం ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఏసీపీ మాధవి నేతృత్వంలో పోలీసులు భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో డాగ్ స్క్వాడ్ బృందాలతో కలిసి బస్టాండ్, కొరియర్ సెంటర్లు, ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలలో శ్రద్ధగా తనిఖీలు జరిపారు.ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ... పేలుడు సామగ్రి, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, ఎక్కడైనా అపరిచిత వ్యక్తులు బ్యాగులు లేదా మూటలు వదిలిపెడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.ఈ తనిఖీల్లో నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్ పుల్లయ్య, ఎస్సై యూనస్ అహ్మద్ అలీతో పాటు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

హుజురాబాద్/ నవంబర్11(మా అక్షరం): సీపీ గౌస్ ఆలాం ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఏసీపీ మాధవి నేతృత్వంలో పోలీసులు భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో డాగ్ స్క్వాడ్ బృందాలతో కలిసి బస్టాండ్, కొరియర్ సెంటర్లు, ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలలో శ్రద్ధగా తనిఖీలు జరిపారు.ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ… పేలుడు సామగ్రి, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, ఎక్కడైనా అపరిచిత వ్యక్తులు బ్యాగులు లేదా మూటలు వదిలిపెడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.ఈ తనిఖీల్లో నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్ పుల్లయ్య, ఎస్సై యూనస్ అహ్మద్ అలీతో పాటు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !