+91 99635 77856

భారతీయుల్లో దేశభక్తి, స్ఫూర్తిని కలిగించే గేయం”వందేమాతరం “

-భారతీయుల్లో దేశభక్తి, స్ఫూర్తిని కలిగించే గేయం”వందేమాతరం”…. 
-స్వాతంత్ర సమరయోధుల రణ నినాదం వందేమాతరం….
-బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి…

హుజురాబాద్/ నవంబర్13 (మా అక్షరం): స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాదిమంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభసందర్భంలో ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగానే బిజెపి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వందేమాతరం గేయాలాపన కోసం ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. వందేమాతరం 150 వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని హుజురాబాద్ బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో గురువారం వందేమాతరం గేయాలపన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ… వందేమాతరం గేయాన్ని నవంబర్ 7, 1875 న బంకిమ్ చంద్ర చటర్జీ రచించారన్నారు. ప్రధానంగా ఈ గీతం స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, భారతీయుల్లో చైతన్యాన్ని, స్ఫూర్తి , దేశభక్తి నీ రగిల్చిందన్నారు. అలాంటి గొప్పనైన వందేమాతరం దేశ జాతీయ గేయం అయిందన్నారు.150వ వార్షిక వేడుకలను బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయన్నారు. ఈనెల నవంబర్ 26 వరకు జిల్లా లోని అన్ని మండలాల్లో వందేమాతరం గేయాన్ని ఆలపించడానికి, వేడుకలను ఘనంగా నిర్వహించడానికి తగిన కార్యాచరణతో ముందుకు కొనసాగుతున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా చేపడుతున్న వందేమాతర కార్యక్రమాలలో బిజెపి సైతం పాలుపంచుకుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !