+91 99635 77856

మహిళలపై హింస–బాల్యవివాహాల నివారణపై అవగాహన శిక్షణ

Kudikala Sai Editor
maaksharamnews.in

మహిళలపై హింస–బాల్యవివాహాల నివారణపై అవగాహన శిక్షణ

-మహిళలపై హింస–బాల్యవివాహాల నివారణపై అవగాహన శిక్షణ...
- మున్సిపల్ సిబ్బందికి మహిళా శిశు సంక్షేమ శాఖ శిక్షణ...
హుజురాబాద్/నవంబర్ 29:(మా అక్షరం):
మహిళలపై జరుగుతున్న హింస, బాల్య వివాహాల నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.మున్సిపల్ కమిషనర్ కె. సమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ సిబ్బందికి వివిధ చట్టాలు, హెల్ప్‌లైన్ సేవలపై నిపుణులు శిక్షణ అందించారు. జిల్లా మిషన్ శక్తి కో ఆర్డినేటర్ శ్రీలత మహిళా హక్కులు, హింస నిరోధక చట్టాలు, అత్యవసర సేవల కోసం181 హెల్ప్‌లైన్ గురించి వివరించారు.చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ సంపత్ బాల్య వివాహాల చట్టపరమైన అంశాలు,1098 ద్వారా ఎలా ఫిర్యాదు చేయాలి,దత్తత విధానం, పిల్లలపై లైంగిక నేరాల నివారణ చట్టాలు, ఆడపిల్లలకు అందుబాటులో ఉన్న సదుపాయాలపై శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రమ్య, నషా ముక్తి అభియాన్ ప్రతినిధి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-మహిళలపై హింస–బాల్యవివాహాల నివారణపై అవగాహన శిక్షణ…
– మున్సిపల్ సిబ్బందికి మహిళా శిశు సంక్షేమ శాఖ శిక్షణ…
హుజురాబాద్/నవంబర్ 29:(మా అక్షరం):
మహిళలపై జరుగుతున్న హింస, బాల్య వివాహాల నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.మున్సిపల్ కమిషనర్ కె. సమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ సిబ్బందికి వివిధ చట్టాలు, హెల్ప్‌లైన్ సేవలపై నిపుణులు శిక్షణ అందించారు. జిల్లా మిషన్ శక్తి కో ఆర్డినేటర్ శ్రీలత మహిళా హక్కులు, హింస నిరోధక చట్టాలు, అత్యవసర సేవల కోసం181 హెల్ప్‌లైన్ గురించి వివరించారు.చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ సంపత్ బాల్య వివాహాల చట్టపరమైన అంశాలు,1098 ద్వారా ఎలా ఫిర్యాదు చేయాలి,దత్తత విధానం, పిల్లలపై లైంగిక నేరాల నివారణ చట్టాలు, ఆడపిల్లలకు అందుబాటులో ఉన్న సదుపాయాలపై శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రమ్య, నషా ముక్తి అభియాన్ ప్రతినిధి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !