+91 99635 77856

బీఆర్‌ఎస్ నాయకుల వ్యాఖ్యలు బాధ్యరహితం.

Kudikala Sai Editor
maaksharamnews.in

బీఆర్‌ఎస్ నాయకుల వ్యాఖ్యలు బాధ్యరహితం.

-బీఆర్‌ఎస్ నాయకుల వ్యాఖ్యలు బాధ్యరహితం...
- కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మిడిదొడ్డి రాజు...
హుజురాబాద్/ నవంబర్ 30(మా అక్షరం): బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ నేత ప్రణవ్‌పై చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని, ఇటువంటి వ్యాఖ్యలను భవిష్యత్తులో సహించబోమని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మిడిదొడ్డి రాజు హెచ్చరించారు.బీఆర్‌ఎస్‌కు చెందిన కొంతమంది నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం పరస్పరం విరుద్ధంగా ప్రవర్తిస్తూ, ప్రణవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. దళిత బంధు లబ్ధిదారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు ఇప్పుడు ప్రణవ్‌ను విమర్శించడం సరికాదని రాజు విమర్శించారు.కాంగ్రెస్ నాయకుల సమక్షంలో అనుకూలంగా ప్రవర్తిస్తూ, బయటకు వెళ్లి విరుద్ధ ప్రకటనలు చేసే బీఆర్‌ఎస్ నేతలు ముందుగా తమ వైఖరిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రణవ్ ఇంటికి, అనుచరులకు దగ్గరగా తిరుగుతూ ఒక విధంగా వ్యవహరించి, ప్రజల ముందు వేరుగా మాట్లాడడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.ప్రణవ్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ బీఆర్‌ఎస్ నాయకులకు అసహనాన్ని కలిగిస్తోందని, ఆ అసహనం కారణంగానే వారు తీవ్ర వ్యాఖ్యలకు దిగుతున్నారని రాజు అభిప్రాయపడ్డారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేస్తారే గాని వ్యక్తిగత ఆకర్షణలు, ఒత్తిడులు తమ నిర్ణయంపై ప్రభావం చూపవని ఆయన అన్నారు.ప్రణవ్‌పై భవిష్యత్తులో మరేదైనా అనుచిత వ్యాఖ్యలు చేయకుండా బీఆర్‌ఎస్ నాయకులు జాగ్రత్త పడాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తుందని మిడిదొడ్డి రాజు హెచ్చరించారు.

Share ePaper Clip

Preparing image...

-బీఆర్‌ఎస్ నాయకుల వ్యాఖ్యలు బాధ్యరహితం…
– కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మిడిదొడ్డి రాజు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !