-జర్నలిస్టుల మహా ధర్నా ఘనవిజయం..
హైదరాబాద్/ డిసెంబర్ 03 (మా అక్షరం):పన్నెండేళ్లుగా పరిష్కారం కాని జర్నలిస్టుల సమస్యలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘంటి యు డబ్ల్యూ జె (ఐ జే యు) ఆధ్వర్యంలో మాసాబ్‌ట్యాంక్‌లోని సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన మహా ధర్నా అనూహ్య రీతిలో విజయవంతం అయింది.
టి యు డబ్ల్యూ జె (ఐ జే యు) పిలుపుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు విపరీతంగా స్పందించారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల నుంచి భారీగా పాత్రికేయులు తరలిరావడంతో ఆ ప్రాంతం నినాదాలతో కోలాహలంగా మారింది. సమాచార శాఖ చరిత్రలో ఇంత భారీ సంఖ్యలో జర్నలిస్టులు ఒకేచోట ధర్నా చేయడం ఇదే మొదటిసారి అని పలువురు సీనియర్ జర్నలిస్టులు, పోలీసులు వ్యాఖ్యానించారు.ధర్నాకు యూనియన్ అనుబంధ సంస్థలైన తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్, వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్, చిన్న–మధ్య తరగతి పత్రికల సంఘం, మహిళా జర్నలిస్టుల విభాగం, తెలంగాణ ఉర్దూ జర్నలిస్టుల సమాఖ్య, అలాగే హైదరాబాద్ ప్రెస్ క్లబ్, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, జవహర్‌లాల్ హౌసింగ్ సొసైటీ తదితర సంస్థలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ మహా ధర్నాలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, ఎం.ఏ. మాజీద్, జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఉప ప్రధాన కార్యదర్శి కలుకూరి రాములు, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ, నగునూరి శేఖర్, చిన్న పత్రికల సంఘం నాయకులు యూసుఫ్ బాబు, అశోక్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష–కార్యదర్శులు విజయ్ కుమార్ రెడ్డి, రమేష్, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ గంగాధర్, కె.ఎన్. హరి, వీడియో జర్నలిస్టుల సంఘం నాయకులు నాగరాజు, హరీష్, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గోపరాజు తదితరులు పాల్గొని మాట్లాడారు.
అలాగే యూనియన్ నాయకులు యాదగిరి, కె. శ్రీకాంత్ రెడ్డి, మధు గౌడ్, ఫైసల్, హెచ్‌యూజే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు ఏ. రాజేష్, ఉర్దూ జర్నలిస్టుల అసోసియేషన్ కార్యదర్శి గౌస్, సీనియర్ మహిళా జర్నలిస్టులు విమల, అత్తలూరి అరుణ, వాకటి మంజుల, కళ్యాణం రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.











