+91 99635 77856

కొత్తపల్లి నాగేంద్ర స్వామి దేవాలయం వద్ద మార్మోగిన అయ్యప్ప శరణు ఘోష

Kudikala Sai Editor
maaksharamnews.in

కొత్తపల్లి నాగేంద్ర స్వామి దేవాలయం వద్ద మార్మోగిన అయ్యప్ప శరణు ఘోష

-కొత్తపల్లి నాగేంద్ర స్వామి దేవాలయం వద్ద మార్మోగిన అయ్యప్ప శరణు ఘోష..
-రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మహా దివ్య పడిపూజ…
హుజురాబాద్‌/ డిసెంబర్03(మా అక్షరం):మండలంలోని కొత్తపల్లి నాగేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో మంగళవారం మహా దివ్య పడి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోరెడ్డి రవీందర్ రెడ్డి 18వ పడి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.మోతే తిరుపతి గురుస్వామి,కే వెంకట్రావు, కన్నన్ దురై రాజ్ గురు స్వాముల ఆధ్వర్యంలో పేద పండితులు అవధారుల భాస్కర్ శర్మ, కాట్రపల్లి శ్రీకాంత్ శర్మల మంత్రోచ్ఛారణల మధ్య సాగిన ఈ పడి పూజ వేడుకల్లో హుజురాబాద్ పట్టణం, వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి అయ్యప్ప మాల ధరించిన సుమారు 300 మంది స్వాములు, 200 మంది నానుస్వాములు పాల్గొన్నారు. సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించగా ఆవరణమంతా అయ్యప్ప స్వామి శరణు ఘోషతో మారు మ్రోగింది. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు జమ్మికుంటకు చెందిన గురుస్వామి జయేందర్ స్వామి ఆధ్వర్యంలో జమ్మికుంట చుట్టుపక్కల గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఆరాధించారు. ప్రముఖ గాయకులు వడ్లకొండ అనిల్ కుమార్, హుజురాబాద్ శివరామకృష్ణ, కొత్తపల్లి రామానంద భజన మండలిల ఆధ్వర్యంలో భజన–కీర్తనలు నిర్వహించగా ఆ ప్రాంతమంతా భక్తి వాతావరణం నెలకొంది. రవీందర్ రెడ్డి పడి అంటించగా ఒక్కసారిగా స్వాములు లేచి స్వామియే శరణమయ్యప్ప అంటూ కొలిచారు. అనంతరం తీర్థప్రసాదాలు, అల్పాహారం అందజేషారు. ఈ కార్యక్రమం హుజురాబాద్ పట్టణంలోనీ కొత్తపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా పెద్ద దివ్య మహా పడిపూజ నిర్వహించగా భక్తి పరవశ్యంలో గ్రామస్తులు మునిగిపోయారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !