+91 99635 77856

హుజూరాబాద్‌లో పంచాయితీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజూరాబాద్‌లో పంచాయితీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు

-హుజూరాబాద్‌లో పంచాయితీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు...
-సిబ్బందికి సూచనలు ఇచ్చిన అడిషనల్ డీసీపీ భీం రావు...

హుజూరాబాద్/ డిసెంబర్ 16(మా అక్షరం):
మూడో విడత పంచాయితీ ఎన్నికల సందర్భంగా మండలంలో జరుగుతున్న ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బందోబస్తు ఇంచార్జ్ ఆఫీసర్ అడిషనల్ డీసీపీ భీం రావు మంగళవారం పోలీస్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తగు సూచనలు, మార్గదర్శకాలను వివరించారు.ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడటం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఈ బందోబస్తు కార్యక్రమం హుజూరాబాద్ ఏసిపి మాధవి మేడం సూచనల మేరకు నిర్వహించగా, పోలీస్ సిబ్బందికి విధులను కేటాయించారు.ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఏసిపి వి. సతీష్, హుజూరాబాద్ పట్టణ సీఐ టీ. కరుణాకర్‌తో పాటు బందోబస్తుకు విచ్చేసిన ఇన్‌స్పెక్టర్ ఆఫీసర్లు పుల్లయ్య, రామచంద్రరావు, సరిలాల్, ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.అదేవిధంగా రూట్ ఆఫీసర్లుగా నియమితులైన 12 మంది ఎస్‌ఐలు, సుమారు 150 మంది పోలీస్ సిబ్బంది ఈ బందోబస్తు సమావేశంలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-హుజూరాబాద్‌లో పంచాయితీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు…
-సిబ్బందికి సూచనలు ఇచ్చిన అడిషనల్ డీసీపీ భీం రావు…

హుజూరాబాద్/ డిసెంబర్ 16(మా అక్షరం):
మూడో విడత పంచాయితీ ఎన్నికల సందర్భంగా మండలంలో జరుగుతున్న ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బందోబస్తు ఇంచార్జ్ ఆఫీసర్ అడిషనల్ డీసీపీ భీం రావు మంగళవారం పోలీస్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తగు సూచనలు, మార్గదర్శకాలను వివరించారు.ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడటం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఈ బందోబస్తు కార్యక్రమం హుజూరాబాద్ ఏసిపి మాధవి మేడం సూచనల మేరకు నిర్వహించగా, పోలీస్ సిబ్బందికి విధులను కేటాయించారు.ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఏసిపి వి. సతీష్, హుజూరాబాద్ పట్టణ సీఐ టీ. కరుణాకర్‌తో పాటు బందోబస్తుకు విచ్చేసిన ఇన్‌స్పెక్టర్ ఆఫీసర్లు పుల్లయ్య, రామచంద్రరావు, సరిలాల్, ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.అదేవిధంగా రూట్ ఆఫీసర్లుగా నియమితులైన 12 మంది ఎస్‌ఐలు, సుమారు 150 మంది పోలీస్ సిబ్బంది ఈ బందోబస్తు సమావేశంలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !