హుజురాబాద్/డిసెంబర్ 19(మా అక్షరం): పట్టణంలోని కాకతీయ కాలనీలో పంచకోటి సంతోష్ గురుస్వామి 18వ పడి సందర్భంగా ఘనంగా దివ్య మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. కన్నన్దొరై రాజు కే వెంకట్రావు ఉపేందర్ గురుస్వాముల ఆధ్వర్యంలో ఈ మహా పడిపూజ కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. కన్య స్వాములు అయ్యప్ప స్వామిని పేటతుళ్ళితో స్వామి శరణం అయ్యప్ప… శరణం శరణం అయ్యప్ప అంటూ పేట తుళ్లి ఆడి పాడారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పదునేట్టంబడినీ సంతోష్ గురుస్వామి వెలిగించారు. వెంటనే స్వాముల శరణు ఘోషతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. రంగ రంగ వైభవంగా దివ్య మహా పడిపూజ కార్యక్రమాన్నికి అయ్యప్ప భక్తులు నాన్ అయ్యప్పలు హాజరై విజయవంతం చేశారు
Post Views: 197











