హుజురాబాద్/జనవరి 03(మా అక్షరం): పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి కూడలి లో సావిత్రిబాయి పూలే 195జయంతి వేడుకలు శనివారం జయంతోత్సవ కమిటీ అధ్యక్షులు ఇప్పలపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం మహిళా టీచర్లను శాలువాలతో సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా పూలే సమాజానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరాలకు స్పూర్తిదాయకమని అన్నారు. మహిళాభ్యుదయం, మహిళా సాధికారత సాధనలో ఆమె చేసిన సేవలు చిరస్మరణీయ మని అన్నారు. చివరి శ్వాస వరకు ప్రజా సేవలోనే గడిపిన సావిత్రిబాయి జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమన్నారు. ఎన్నో అవమానాలు, అవరోధాలను దాటుకుని భర్త సహకారంతో మహిళల కోసం విద్యాలయాలు స్థాపించి వారి అభ్యున్నతి కోసం కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మున్సిపల్ కమిషనర్ కెంసారపు సమ్మయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, పూలే జయంత్యుత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, ఉప్పు శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, చిలుక మారి శ్రీనివాస్, సందెళ్ల వెంకన్న, ప్రజాసంఘాల నాయకులు మాచర్ల నరేష్, రాజేష్, సందీప్, రాజేందర్, బీమోజు సందానందం,బండారి సదానందం, సొల్లు సునీత, నాగమణి, సమ్మయ్య ముదిరాజ్, మార్తరవీందర్ , ఖాలీద్ హుస్సేన్, గడప రాజు, రవీందర్, వేణుగోపాల్, వేల్పుల రత్నం, ఉపాధ్యాయురాలు దేవిక, దివ్య, విద్యార్థులు పాల్గొన్నారు.











