హుజూరాబాద్/డిసెంబర్ 31(మా అక్షరం):చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని మాంటిస్సోరి ప్రిన్సిపాల్ గీతాషాజు అన్నారు. బుధవారం పట్టణంలోని కాకతీయకాలనీకి చెందిన మహమ్మద్ నూరిన్ జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన సందర్భంగా ఆమెకు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ . గతనెల డిసెంబర్ 25న వనపర్తిలో జరిగిన అండర్ 14 హాకీ పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభను కనపరిచినందుకు జనవరి 2 వతేదీన మధ్యప్రదేశ్ లో ని గ్వాలియర్లో జరిగే జాతీయస్థాయి అండర్ 14 బాలికల హాకీ పోటీల్లో ఆమె ఎంపిక కావడం ప్రశంసనీయమన్నారు. ఈ విద్యార్థినిని స్ఫూర్తిగా తీసుకొని మరెందరో క్రీడాకారులు తయారు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ షాజూ థామస్ ,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 189











