+91 99635 77856

శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి

-శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి...
-పట్టణ సిఐ టి. కరుణాకర్...
హుజురాబాద్/డిసెంబర్ 30(మా అక్షరం): నూతన సంవత్సరం వేడుకలను శాంతియుతంగా, కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని పట్టణ సిఐ టి. కరుణాకర్ ప్రజలను కోరారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించవద్దని సూచించారు.యువకులు బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు, అతి శబ్దాలు చేయరాదని హెచ్చరించారు. ఇలా చేస్తే వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తామని తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, బెల్ట్ దుకాణాల్లో మద్యం విక్రయించినా లేదా సేవించినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నూతన సంవత్సరం సందర్భంగా హుజురాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుశిక్షతో పాటు కేసులు తప్పవని అన్నారు.

Share ePaper Clip

Preparing image...

-శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి…
-పట్టణ సిఐ టి. కరుణాకర్…
హుజురాబాద్/డిసెంబర్ 30(మా అక్షరం): నూతన సంవత్సరం వేడుకలను శాంతియుతంగా, కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని పట్టణ సిఐ టి. కరుణాకర్ ప్రజలను కోరారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించవద్దని సూచించారు.యువకులు బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు, అతి శబ్దాలు చేయరాదని హెచ్చరించారు. ఇలా చేస్తే వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తామని తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, బెల్ట్ దుకాణాల్లో మద్యం విక్రయించినా లేదా సేవించినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నూతన సంవత్సరం సందర్భంగా హుజురాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుశిక్షతో పాటు కేసులు తప్పవని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !