+91 99635 77856

ఆల్ఫోర్స్ లో ముందస్తు సంక్రాంతి ఉత్సవాలు

Kudikala Sai Editor
maaksharamnews.in

ఆల్ఫోర్స్ లో ముందస్తు సంక్రాంతి ఉత్సవాలు

-ఆల్ఫోర్స్ లో ముందస్తు సంక్రాంతి ఉత్సవాలు....
హుజూరాబాద్/జనవరి 07 (మా అక్షరం): పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను బుధవారం రోజున ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలకి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ...భారతదేశ సంప్రదాయ పండుగల్లో సంక్రాంతి ఒక అత్యంత పవిత్రమైన, ఆనందభరితమైన పండుగ అని, పంటలు చేతికి వచ్చిన సంతోషాన్ని పంచుకునే ఈ పండుగ రైతుల శ్రమకు గౌరవం తెలిపే మహత్తర సందర్భం. ప్రకృతితో మన అనుబంధాన్ని గుర్తు చేసే పండుగగా సంక్రాంతి నిలుస్తుంది. ఈ పండుగ మనకు కష్టపడే తత్వం, సహనం, ఐక్యత వంటి విలువలను నేర్పుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడం, పెద్దలను గౌరవించడం, చిన్నారుల్లో మంచి సంస్కారాలను పెంపొందించడం వంటి గొప్ప లక్షణాలు ఈ పండుగ ద్వారా మనకు లభిస్తాయి. మన సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవడమే కాకుండా, వాటిని రాబోయే తరాలకు అందించడం మన బాధ్యత అని తెలిపారు. తదనంతరం విద్యార్థులతో కలిసి వరి నాటు వేశారు. అలాగే కిండన్ గార్డెన్ పిల్లలకి భోగి పళ్ళు పోశారు తదనంతరం భోగి మంటవేసి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన డాన్సులు, మన సంస్కృతిని తెలియజేసే ప్రదర్శనలు, గ్రామీణ వృత్తులు, సాంప్రదాయాలు వాటి విశిష్టత అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-ఆల్ఫోర్స్ లో ముందస్తు సంక్రాంతి ఉత్సవాలు….
హుజూరాబాద్/జనవరి 07 (మా అక్షరం): పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను బుధవారం రోజున ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలకి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ…భారతదేశ సంప్రదాయ పండుగల్లో సంక్రాంతి ఒక అత్యంత పవిత్రమైన, ఆనందభరితమైన పండుగ అని, పంటలు చేతికి వచ్చిన సంతోషాన్ని పంచుకునే ఈ పండుగ రైతుల శ్రమకు గౌరవం తెలిపే మహత్తర సందర్భం. ప్రకృతితో మన అనుబంధాన్ని గుర్తు చేసే పండుగగా సంక్రాంతి నిలుస్తుంది. ఈ పండుగ మనకు కష్టపడే తత్వం, సహనం, ఐక్యత వంటి విలువలను నేర్పుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడం, పెద్దలను గౌరవించడం, చిన్నారుల్లో మంచి సంస్కారాలను పెంపొందించడం వంటి గొప్ప లక్షణాలు ఈ పండుగ ద్వారా మనకు లభిస్తాయి. మన సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవడమే కాకుండా, వాటిని రాబోయే తరాలకు అందించడం మన బాధ్యత అని తెలిపారు. తదనంతరం విద్యార్థులతో కలిసి వరి నాటు వేశారు. అలాగే కిండన్ గార్డెన్ పిల్లలకి భోగి పళ్ళు పోశారు తదనంతరం భోగి మంటవేసి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన డాన్సులు, మన సంస్కృతిని తెలియజేసే ప్రదర్శనలు, గ్రామీణ వృత్తులు, సాంప్రదాయాలు వాటి విశిష్టత అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !