+91 99635 77856

పాఠశాలల అకాడమిక్ ఇన్స్పెక్షన్

Kudikala Sai Editor
maaksharamnews.in

పాఠశాలల అకాడమిక్ ఇన్స్పెక్షన్

హుజురాబాద్ /జనవరి 07 (మా అక్షరం): మండలంలోని ప్రాథమిక పాఠశాల బోర్నపల్లి, కేసీ క్యాంప్‌లను జిల్లా అకాడమిక్ ప్యానెల్ సభ్యులు బుధవారం పరిశీలించారు. అకాడమిక్ రిజిస్టర్‌లు, ఉపాధ్యాయులు — విద్యార్థుల హాజరు రిజిస్టర్లు, ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమంలో నిర్వహించిన బేస్ టెస్ట్, మిడ్‌లైన్ టెస్ట్, ఫార్మేటివ్ అసెస్మెంట్‌–1,2,3 ఫలితాలను టీం సభ్యులు పరిశీలించారు.తరగతుల వారీగా విద్యార్థుల చదవడం, రాయడం, గణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం నేర్చుకున్న స్థాయిని పరీక్షించారు. వర్క్‌బుక్స్‌ను కూడా పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు అందజేశారు.త్వరలో జరగనున్న FLS పరీక్షలకు 3వ తరగతి విద్యార్థులను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాల‌ని ఉపాధ్యాయులకు కమిటీ సూచించారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ ప్యానెల్ సభ్యులు దాసరి శ్రీధర్, యాళ్లం కొండల్‌రెడ్డి, తాళ్ల తిరుపతి, ప్రధానోపాధ్యాయులు ఈ.పరిమళ, బి.కె.శోభారాణి, ఉపాధ్యాయులు బి.సునీత, జి.తిరుపతి, కె.మహేష్‌కుమార్, సిఆర్‌పి ఎం.రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !