+91 99635 77856

సిర్సపల్లి డంపింగ్‌ యార్డు నిలిపివేయాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

సిర్సపల్లి డంపింగ్‌ యార్డు నిలిపివేయాలి

-సిర్సపల్లి డంపింగ్‌ యార్డు నిలిపివేయాలి...
-శాసన మండలిలో బల్మూర్ వెంకట్...
హుజూరాబాద్/జనవరి 06(మా అక్షరం): మండలంలోని సిర్సపల్లి గ్రామంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌పై మంగళవారం శాసన మండలిలో ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు.డంపింగ్ యార్డులో వ్యర్థాలను కాల్చడం వల్ల గాలిలోకి విడుదలయ్యే కాడ్మియం, క్రోమియం వంటి హానికర రసాయనాల కారణంగా పెద్దలు, చిన్నపిల్లలు ప్రమాదకర వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

ఈ యార్డు వల్ల చుట్టుపక్కల గ్రామాలు కాలుష్యానికి గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉత్పన్నమవుతుందని హెచ్చరించారు. భూగర్భజలాలు తగ్గి కాలుష్యం పెరిగి, పంట పొలాల విలువ పడిపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఈ ప్రతిపాదన ఎలా ఆమోదం పొందిందన్న దానిపై సందేహాలు వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలో ఉన్న నేపథ్యంలో, సిర్సపల్లిలో డంపింగ్ యార్డు ఏర్పాటును విరమించుకోవాలని ప్రభుత్వాన్ని సభావేదికగా కోరుతున్నట్లు తెలిపారు.

Share ePaper Clip

Preparing image...

-సిర్సపల్లి డంపింగ్‌ యార్డు నిలిపివేయాలి…
-శాసన మండలిలో బల్మూర్ వెంకట్…
హుజూరాబాద్/జనవరి 06(మా అక్షరం): మండలంలోని సిర్సపల్లి గ్రామంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌పై మంగళవారం శాసన మండలిలో ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు.డంపింగ్ యార్డులో వ్యర్థాలను కాల్చడం వల్ల గాలిలోకి విడుదలయ్యే కాడ్మియం, క్రోమియం వంటి హానికర రసాయనాల కారణంగా పెద్దలు, చిన్నపిల్లలు ప్రమాదకర వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

ఈ యార్డు వల్ల చుట్టుపక్కల గ్రామాలు కాలుష్యానికి గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉత్పన్నమవుతుందని హెచ్చరించారు. భూగర్భజలాలు తగ్గి కాలుష్యం పెరిగి, పంట పొలాల విలువ పడిపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఈ ప్రతిపాదన ఎలా ఆమోదం పొందిందన్న దానిపై సందేహాలు వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలో ఉన్న నేపథ్యంలో, సిర్సపల్లిలో డంపింగ్ యార్డు ఏర్పాటును విరమించుకోవాలని ప్రభుత్వాన్ని సభావేదికగా కోరుతున్నట్లు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !