+91 99635 77856

క్యాట్ ఫలితాల్లో ఇందిరానగర్ శ్రీ చైతన్య విద్యార్ధుల ప్రతిభ

-క్యాట్ ఫలితాల్లో ఇందిరానగర్ శ్రీ చైతన్య విద్యార్ధుల ప్రతిభ…
ఎల్కతుర్తి/ జనవరి 09 (మా అక్షరం): ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన నాలేడ్జ్ అసెస్ మెంట్ టెస్ట్ క్యాట్ ఒలంపియాడ్ పరీక్ష ఫలితాల్లో హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ లోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను చాటారు. గురువారం విడుదలైన క్యాట్ ఫలితాల్లో తమ పాఠశాల నుండి 86 మంది విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ బండారి సంపత్ తెలిపారు. జాతీయ స్థాయిలో 12 మంది విద్యార్థులు క్యాష్ అవార్డులు, గోల్డ్ మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు పొందగా, 74 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు పొందారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రిన్సిపాల్ సంపత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అభినందన సభ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, ఏజీఎం పద్మాకర్ రెడ్డి, కోఆర్డినేటర్ తిరుమల్ రెడ్డి, ఇంచార్జీ రజనీకాంత్ లు అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంపత్ మాట్లాడుతూ… మారుతున్న సాంకేతిక విద్యా విధానాలకు అనుగుణంగా క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్పించడంలో శ్రీ చైతన్య ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఇలాంటి పోటీలు విద్యార్థులు మేధొవికాసానికి ఎంతగానో సహకరిస్తాయని అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్యసాధన కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఒలింపియాడ్ ఇంచార్జీ కావ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !