+91 99635 77856

సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఘనంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణం

Kudikala Sai Editor
maaksharamnews.in

సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఘనంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణం

హుజురాబాద్/ జనవరి13 (మా అక్షరం): పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం పూలతో, దీపాలతో, రంగురంగుల అలంకరణలతో సుందరంగా ముస్తాబైంది.ఈ సందర్భంగా వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య స్వామివార్ల కళ్యాణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గోదాదేవి, రంగనాథ స్వామివార్లను పుష్పాలంకరణలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణోత్సవాన్ని వీక్షించి, స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !