+91 99635 77856

రాయపల్లి గ్రామంలో పలు కుటుంబాలకు పరామర్శ.

-రాయపల్లి గ్రామంలో పలు కుటుంబాలకు పరామర్శ…

-కౌడగని దేవేందర్ కుటుంబానికి 50 కిలోల బియ్యం, సరుకులు అందజేత…
-బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్ ఆధ్వర్యంలో…
-బీసీ జేఏసీ గౌరవాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న…
-రాయపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్, ప్రజా సంఘాలు…

రేగొండ/ జనవరి13 (మా అక్షరం):జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాయపల్లి గ్రామంలో ఇటీవలమరణించిన ఏడెల్లి నరసింహారెడ్డి, కౌడగని దేవేందర్ కుటుంబాలను అదే గ్రామానికి చెందిన హుజురాబాద్ బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్ ఆధ్వర్యంలో హుజురాబాద్ జేఏసీ నాయకులు మరణించిన వారి కుటుంబసభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబాలకు తెలియ చేశారు. అలాగే వారు కౌడగాని దేవేందర్ మృతి పట్ల50 కిలోల బియ్యం సరుకులు వారి కుటుంబానికి అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న మాట్లాడుతూ.. ఇప్పకాయల సాగర్ తాను హుజూరాబాద్ లో నివాసం ఉంటున్నప్పటికీ తన గ్రామం ప్రజల పట్ల ప్రేమఅభిమానంతో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టడాన్ని ఈ సందర్భంగా వారు అభినందించినారు. ఇక ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొని గ్రామ ప్రజల యొక్క ఆదరాభి మానాన్ని ఎల్లప్పుడూ చూర గొనాలని ఆకాంక్షించినారు. అనంతరం ఇటీవల ఎన్నికైన గ్రామ సర్పంచ్ తాడం తిరుపతి, ఉప సర్పంచ్ బూర్గుల వెంకటేష్, వార్డ్ మెంబర్ అంకం రమేష్ లకు శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగినది. అలాగే వారు మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని వారు కోరుకున్నారు. ఈకార్యక్రమం లో హుజురాబాద్ బిసి జేఏసీ నాయకులు గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, కార్యదర్శి మామునూరి ప్రవీణ్, బాబర్ బాయ్, సొల్లు శంకర్, కొత్తూరు జీవన్ కుమార్, అందే తిరుపతి, గ్రామానికి చెందిన తాడం తిరుపతి సర్పంచ్, బూర్గుల వెంకటేష్ ఉపసర్పంచ్, అంకం రమేష్ వార్డు మెంబర్, ఖ్యాతం మహేందర్, ఇప్పకాయల రాజశేఖర్, సురేష్, ఖ్యాతం సదయ్య, ల్యాదల్ల కిరణ్, కృష్ణ, వీరన్న, సంజీవరెడ్డి, దండవేణి రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !