-జాతీయ రోడ్డు భద్రత మసోత్సవ సందర్భంగా..సురక్షిత గ్రామ ప్రచార…
– హుజురాబాద్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు …
హుజురాబాద్/ జనవరి 15(మా అక్షరం): మండలంలోని రాజ పల్లి గ్రామంలో రోడ్డు భద్రత మాసో త్సవ సందర్భంగా హుజరాబాద్ రవాణా శాఖ హుజురాబాద్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు నేతృత్వంలో సురక్ష గ్రామ ప్రచార సందర్భంగా గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు మాట్లాడుతూ.. గ్రామాల్లో రహదారి ప్రమాదాలను తగ్గించి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి “సురక్షిత గ్రామ ప్రచార నమూనా ప్రాంతాల్లో 100% హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగాన్ని ప్రోత్సహించడం.మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన.మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టడం.ఒక ముఖ్యమైన వ్యూహం.సురక్షిత గ్రామ ప్రచార లక్ష్యాలు.గ్రామం ప్రవేశ ద్వారం వద్ద మరియు ముఖ్యమైన కూడళ్లలో “వేగ పరిమితి”, “హెల్మెట్ ధరించండి” వంటి సూచిక బోర్డులను ఏర్పాటు చెయ్యాలని రాజపల్లి గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి కోరారు.సురక్షిత రహదారి వినియోగం – సూచనలు రాత్రి వేళ ప్రయాణం: ఎద్దుల బండ్లు లేదా ట్రాక్టర్లకు తప్పనిసరిగా రేడియం స్టిక్కర్లు అంటించాలి, తద్వారా వెనుక నుంచి వచ్చే వాహనాలకు అవి కనిపిస్తాయి.రహదారి ఆక్రమణలు రహదారులపై ధాన్యం ఆరబోయడం లేదా పశువులను కట్టేయడం వంటివి చేయకూడదు.మలుపుల వద్ద జాగ్రత్త: గ్రామాల్లోని ఇరుకైన మలుపుల వద్ద వేగాన్ని తగ్గించి, హారన్ ఉపయోగించాలి.రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి.జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రాజపల్లి గ్రామంలో అవగాహన కార్య క్రమాన్ని నిర్వహించారు. దేశంలో గత ఏడాది 4.80 లక్షల ప్రమా దాలు జరిగాయని, దానిలో 1.70లక్షల మంది ప్రాణాలు కోల్పోఁయారని తెలిపారు. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది మృతిచెందుతున్నారని వివరించారు. జిల్లాలో గత ఏడాది 268ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాల్లో మొదట బాధితులు డ్రైవర్లేననీ, ప్రతి డ్రైవర్ రోజు వాహన భద్రత ప్రతిజ్ఞ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. తమ కుటుంబ, పిల్ల ల బాధ్యతను గుర్తుపెట్టుకొని జాగ్రతగా వెళ్లాలన్నారు. రోడ్డు ప్రమాదంతో డ్రైవర్ తోపాటు ఎదుటివారి జీవితా లు ఇబ్బందుల్లో పడతాయని తెలిపారు. అందరూ తప్ప నిసరిగా ట్రాఫిక్‌రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని పిలుపునిచ్చారు. ప్రయాణికులతో మర్యాదగా ఉండాలని సూచించారు.డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్ వాడొద్దు..డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి డైవ్రర్ ఫోన్ వినియోగించవద్దని హుజురాబాద్ వాహనముల తనిఖీ అధికారి కంచి వేణు సూచించారు. అపరిచిత డ్రైవర్లు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరా రు. స్కూల్ ఆటోలు, బస్సుల్లో పరిమితికి మించి విద్యా ర్థులను తరలించవద్దన్నారు. త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి గ్రామ ఉపసర్పంచ్ శనిగరపు ఐలయ్య, పోచయ్య, సమ్మయ్య, ప్రవీణ్, లక్ష్మి, కొరబార్ తిరుపతి యూత్ వినయ్, సాయి చందు, అజయ్ రవాణా శాఖ సిబ్బంది కానిస్టేబుల్ కత్తులు నాగరాజు హోంగార్డ్ బుర్ర సురేష్ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.











