-విద్యార్థులు ఫిర్యాదుల పెట్టెను వినియోగించుకోవాలి…
– డిప్యూటీ డీ ఎం హెచ్ వో డాక్టర్ చందు…
హుజురాబాద్/జనవరి 20( మా అక్షరం): విద్యార్థులు ఫిర్యాదుల పెట్టెను వినియోగించుకోవాలని హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు సూచించారు. మంగళవారం పట్టణంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్నేహిత ఫేస్ 2 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్నేహిత కార్యక్రమం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని, ఫిర్యాదుల పెట్టెను తప్పక వినియోగించుకోవాలని సూచించారు. సమస్యలు ఉంటే నిర్భయంగా చీటీలు రాసి ఫిర్యాదుల పెట్టెలో వేయాలని, రాసే వారి పేర్లను పొందుపరచాల్సిన అవసరం లేదని, ఫిర్యాదులు అందిన వెంటనే షీ టీం సిబ్బంది తప్పక స్పందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం లో చెల్పూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తులసిదాస్, ఎం ఈ వో శ్రీనివాస్, ఎస్సై యూనస్ ఆలీ, ఐసీ డిఎస్ అధికారిణి రమ్య, అగ్రికల్చర్ ఆఫీసర్ భూమి రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు సునీత, పాఠశాల, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.











