+91 99635 77856

రంగనాయక గుట్ట సమ్మక్క–సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ

-రంగనాయక గుట్ట సమ్మక్క–సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ…
-భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం వోడితల ప్రణవ్…
హుజురాబాద్/ జనవరి20 (మా అక్షరం):పట్టణంలోని రంగనాయక గుట్ట వద్ద ఈ నెల 28 నుంచి జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల నేపథ్యంలో జాతర నిర్వహణకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వోడితల ప్రణవ్ జాతర కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రంగనాయక గుట్టలోని సమ్మక్క–సారలమ్మ గద్దెలను సందర్శించిన ఆయన, కమిటీ సభ్యులకు కండువాలు కప్పి జాతర ఏర్పాట్ల పనులను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం గద్దెల వద్ద సమ్మక్క–సారలమ్మకు బంగారం చెల్లించి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…“జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల వసతులు కల్పిస్తాం, తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, రవాణా వంటి ఏర్పాట్లు పకడ్బందీగా చేపడతాం”అని తెలిపారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.జాతర ఏర్పాట్లను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సహకరించాలని ఆయన కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !