+91 99635 77856

హుజరాబాద్ మండలంలో అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్

Kudikala Sai Editor
maaksharamnews.in

హుజరాబాద్ మండలంలో అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్

-హుజరాబాద్ మండలంలో అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్...
-రాంపూర్, గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలల పరిశీలన...
హుజరాబాద్/జనవరి 20(మా అక్షరం): మండలంలోని ప్రాథమిక పాఠశాల రాంపూర్ మరియు ప్రాథమిక పాఠశాల గాంధీనగర్ లను అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ లో భాగంగా కరీంనగర్ జిల్లా అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు మంగళవారం సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాలలకు సంబంధించిన అకాడమిక్ రిజిస్టర్లు, ఉపాధ్యాయులు–విద్యార్థుల హాజరు రిజిస్టర్లు, FLN కార్యక్రమానికి సంబంధించి నిర్వహించిన బేస్ టెస్ట్, మిడ్‌లైన్ టెస్ట్, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫలితాలను పరిశీలించారు. అలాగే విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన మెనూ మరియు అమలు తీరును సమీక్షించారు.తరగతుల వారీగా ఉపాధ్యాయుల బోధన–అభ్యాసన ప్రక్రియలను పరిశీలించి, విద్యార్థుల తెలుగు, ఇంగ్లీష్ చదవడం–రాయడం నైపుణ్యాలు, గణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం వంటి అభ్యసన ఫలితాలు, వర్క్‌బుక్‌లను తనిఖీ చేశారు.ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు తగిన సూచనలు చేశారు.ఫిబ్రవరిలో జరగనున్న FLS పరీక్షకు సంబంధించి మూడో తరగతి విద్యార్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని, ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ సభ్యులు జీవన్‌రెడ్డి, వై.బాలాజీ, ఎ.సునీత, ప్రధానోపాధ్యాయులు ఎం.రజిత, బి.కవిత, ఉపాధ్యాయులు ఎ.స్వర్ణలత, జి.తిరుమల, కె.సుహాసిని, సీఆర్‌పీ ఎం.రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

-హుజరాబాద్ మండలంలో అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్…
-రాంపూర్, గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలల పరిశీలన…
హుజరాబాద్/జనవరి 20(మా అక్షరం): మండలంలోని ప్రాథమిక పాఠశాల రాంపూర్ మరియు ప్రాథమిక పాఠశాల గాంధీనగర్ లను అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ లో భాగంగా కరీంనగర్ జిల్లా అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు మంగళవారం సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాలలకు సంబంధించిన అకాడమిక్ రిజిస్టర్లు, ఉపాధ్యాయులు–విద్యార్థుల హాజరు రిజిస్టర్లు, FLN కార్యక్రమానికి సంబంధించి నిర్వహించిన బేస్ టెస్ట్, మిడ్‌లైన్ టెస్ట్, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫలితాలను పరిశీలించారు. అలాగే విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన మెనూ మరియు అమలు తీరును సమీక్షించారు.తరగతుల వారీగా ఉపాధ్యాయుల బోధన–అభ్యాసన ప్రక్రియలను పరిశీలించి, విద్యార్థుల తెలుగు, ఇంగ్లీష్ చదవడం–రాయడం నైపుణ్యాలు, గణితంలో కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం వంటి అభ్యసన ఫలితాలు, వర్క్‌బుక్‌లను తనిఖీ చేశారు.ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు తగిన సూచనలు చేశారు.ఫిబ్రవరిలో జరగనున్న FLS పరీక్షకు సంబంధించి మూడో తరగతి విద్యార్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని, ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ సభ్యులు జీవన్‌రెడ్డి, వై.బాలాజీ, ఎ.సునీత, ప్రధానోపాధ్యాయులు ఎం.రజిత, బి.కవిత, ఉపాధ్యాయులు ఎ.స్వర్ణలత, జి.తిరుమల, కె.సుహాసిని, సీఆర్‌పీ ఎం.రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !