ఎల్కతుర్తి/జనవరి 23 (మా అక్షరం)
మండలంలోనీ శుక్రవారం రోజున వల్బాపూర్ గ్రామానికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి 74,500 రూపాయల చెక్కులను ఎర్రబెల్లి తిరుపతిరావు 60 వేల రూపాయలు, పంచనేని ప్రశాంత్ రావు 14,500 రూపాయలు లబ్ధిదారులకు చెక్కులను గ్రామ సర్పంచ్ పొనగంటి శ్వేత శ్రీనివాస్ రావు, గ్రామ శాఖ అధ్యక్షులు కట్కూరి గౌతమ్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది . ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతు పేదల, నిరుపేదల, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ప్రభుత్వం ప్రజల కష్టాలను ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్వేత శ్రీనివాస్ రావు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కట్కూరి గౌతమ్, మాజీ సర్పంచ్ రత్నాకర్ రావు, ముక్క ఐలయ్య, అంబాల రంజాన్, పోల్నేని రామారావు, జక్కరాజు కిష్టారావు, చందుపట్ల రఘునాథం, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.











