హుజురాబాద్/జనవరి 23 (మా అక్షరం):పట్టణ పురపాలక సంఘానికి నూతన మునిసిపల్ కమిషనర్‌గా సయ్యద్ ముసబ్ అహ్మద్ శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మునిసిపాలిటీ కార్యాలయంలో చార్జ్ తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, ప్రజా సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మునిసిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు.
Post Views: 322











