-బ్రెయిన్ లో బ్లడ్ స్లాట్ వ్యాధితో కొత్తూరి సువర్ణ…
-హుజురాబాద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత…
హుజురాబాద్ /ఫిబ్రవరి 03(మా అక్షరం): మండలంలోని కనుకుల గిద్ద గ్రామానికి చెందిన బ్రెయిన్ లో బ్లెడ్ స్లాట్ వ్యాధి తో తీవ్ర అనారోగ్యానికి గురి అయిన కొత్తూరి సువర్ణ-జీవన్ కుమార్ కు హుజురాబాద్ బీసీ జేఏసీ, గౌరీశెట్టి మధురమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం స్వగృహానికి వెళ్లి ఆర్థిక సహాయము అందించడం జరిగినది.ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ..పేద కుటుంబానికి చెందిన కొత్తూరు జీవన్ కుమార్ లక్షల రూపాయలు అప్పుగా తెచ్చి గత సంవత్సరము హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్లో మెరుగైన శస్త్ర చికిత్స చేయించినప్పటికీ తన భార్య కొత్తూరి సువర్ణ పూర్తిగా కోలుకోలేదని ఆవేదన వ్యక్తం చేయడం చాలా బాధగా ఉందన్నారు.ఈ విషయం తెలుసుకున్న తాము వారి కుటుంబాన్ని సందర్శించి మా వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించినప్పటికీఅనారోగ్యంతో బాధపడుతూ, లేవలేని స్థితిలో ఉన్నటువంటి కొత్తూరి సువర్ణ కుటుంబాన్ని ఆదుకోవ డానికి దాతలు, సంఘ సేవకులు సహృదయంతో ముందుకు రావాలని కోరుతూ 9492300284 సెల్ నెంబర్ కు విరాళాలు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచుల ఫోరం హుజురాబాద్ మండలం అధ్యక్షులు వన్నాల శివాజీ, గౌరిశెట్టి మధురమ్మ ట్రస్ట్ నిర్వాహకులు గౌరీశెట్టి జగదీశ్వర్, బీసీ జేఏసీ అధ్యక్షులు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శిఇప్పకాయల సాగర్, తాళ్లపల్లి అమరేందర్, పల్లె సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.











