+91 99635 77856

22వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి శ్యామల–ప్రసాద్ ప్రచారానికి విశేష స్పందన

Kudikala Sai Editor
maaksharamnews.in

22వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి శ్యామల–ప్రసాద్ ప్రచారానికి విశేష స్పందన

-22వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి శ్యామల–ప్రసాద్ ప్రచారానికి విశేష స్పందన...
హుజూరాబాద్ /ఫిబ్రవరి 03(మా అక్షరం): మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 22వ వార్డులో బి.ఆర్.ఎస్. పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తలకొక్కుల శ్యామల–ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. తమను ప్రజల బిడ్డగా భావించి ఆశీర్వదించాలని కోరుతూ ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తాను మీ బిడ్డగా, కుటుంబ సభ్యురాలిగా ప్రజల ముందుకు వచ్చానని, తమ అమూల్యమైన ఓటుతో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వార్డుకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు.ప్రత్యేకంగా 22వ వార్డులో నెలకొన్న కోతుల బెడద, తాగునీటి సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు వంటి ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను నేరుగా విని, సంబంధిత అధికారులతో చర్చించి తక్షణమే పరిష్కారం చూపించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళలకు ప్రోత్సాహం, వృద్ధులకు అవసరమైన సహాయం అందించడం తన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉంటాయని తెలిపారు. ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు నడిస్తే 22వ వార్డును నెంబర్ వన్ వార్డుగా తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.చివరగా నన్ను మీ బిడ్డగా భావించి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

Share ePaper Clip

Preparing image...

-22వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి శ్యామల–ప్రసాద్ ప్రచారానికి విశేష స్పందన…
హుజూరాబాద్ /ఫిబ్రవరి 03(మా అక్షరం): మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 22వ వార్డులో బి.ఆర్.ఎస్. పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తలకొక్కుల శ్యామల–ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. తమను ప్రజల బిడ్డగా భావించి ఆశీర్వదించాలని కోరుతూ ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తాను మీ బిడ్డగా, కుటుంబ సభ్యురాలిగా ప్రజల ముందుకు వచ్చానని, తమ అమూల్యమైన ఓటుతో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వార్డుకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు.ప్రత్యేకంగా 22వ వార్డులో నెలకొన్న కోతుల బెడద, తాగునీటి సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు వంటి ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను నేరుగా విని, సంబంధిత అధికారులతో చర్చించి తక్షణమే పరిష్కారం చూపించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళలకు ప్రోత్సాహం, వృద్ధులకు అవసరమైన సహాయం అందించడం తన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉంటాయని తెలిపారు. ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు నడిస్తే 22వ వార్డును నెంబర్ వన్ వార్డుగా తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.చివరగా నన్ను మీ బిడ్డగా భావించి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !