+91 99635 77856

రోజురోజుకు ఉధృతమవుతున్న ప్రచారంతో దూసుకుపోతున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి శ్యామల–ప్రసాద్

Kudikala Sai Editor
maaksharamnews.in

రోజురోజుకు ఉధృతమవుతున్న ప్రచారంతో దూసుకుపోతున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి శ్యామల–ప్రసాద్

-రోజురోజుకు ఉధృతమవుతున్న ప్రచారంతో దూసుకుపోతున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి శ్యామల–ప్రసాద్...

హుజూరాబాద్ / ఫిబ్రవరి 04(మా అక్షరం):మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హుజూరాబాద్ పట్టణంలోని 22వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తలకొక్కుల శ్యామల–ప్రసాద్ రోజురోజుకు ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తూదూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారంతో ప్రజలను నేరుగా కలుస్తూ విస్తృతంగా మద్దతు కూడగట్టుకుంటున్నారు.
ప్రచారంలో భాగంగా ప్రజలను కుటుంబ సభ్యుల్లా పలకరిస్తూ, తమను ప్రజల బిడ్డగా భావించి ఆశీర్వదించాలని ఆమె కోరుతున్నారు. తాను ప్రజల బిడ్డగా, కుటుంబ సభ్యురాలిగా వారి ముందుకు వచ్చానని, తమ అమూల్యమైన ఓటుతో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.22వ వార్డులో నెలకొన్న కోతుల బెడద, తాగునీటి సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు వంటి ప్రాథమిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా విని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని తక్షణ పరిష్కారాలు చూపించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళలకు ప్రోత్సాహం అందించడం, వృద్ధులకు అవసరమైన సహాయం అందించడం తన ప్రాధాన్యతలుగా ఉంటాయని తెలిపారు. ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగితే 22వ వార్డును అభివృద్ధిలో నెంబర్ వన్ వార్డుగా తీర్చిదిద్దుతామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.చివరగా తనను తమ బిడ్డగా భావించి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

Share ePaper Clip

Preparing image...

-రోజురోజుకు ఉధృతమవుతున్న ప్రచారంతో దూసుకుపోతున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి శ్యామల–ప్రసాద్…

హుజూరాబాద్ / ఫిబ్రవరి 04(మా అక్షరం):మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హుజూరాబాద్ పట్టణంలోని 22వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తలకొక్కుల శ్యామల–ప్రసాద్ రోజురోజుకు ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తూదూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారంతో ప్రజలను నేరుగా కలుస్తూ విస్తృతంగా మద్దతు కూడగట్టుకుంటున్నారు.
ప్రచారంలో భాగంగా ప్రజలను కుటుంబ సభ్యుల్లా పలకరిస్తూ, తమను ప్రజల బిడ్డగా భావించి ఆశీర్వదించాలని ఆమె కోరుతున్నారు. తాను ప్రజల బిడ్డగా, కుటుంబ సభ్యురాలిగా వారి ముందుకు వచ్చానని, తమ అమూల్యమైన ఓటుతో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.22వ వార్డులో నెలకొన్న కోతుల బెడద, తాగునీటి సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు వంటి ప్రాథమిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా విని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని తక్షణ పరిష్కారాలు చూపించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళలకు ప్రోత్సాహం అందించడం, వృద్ధులకు అవసరమైన సహాయం అందించడం తన ప్రాధాన్యతలుగా ఉంటాయని తెలిపారు. ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగితే 22వ వార్డును అభివృద్ధిలో నెంబర్ వన్ వార్డుగా తీర్చిదిద్దుతామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.చివరగా తనను తమ బిడ్డగా భావించి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !