+91 99635 77856

అభివృద్ధి కావాలా,అరాచకం కావాలా

-అభివృద్ధి కావాలా,అరాచకం కావాలా…
– కాంగ్రెస్ అంటే అభివృద్ధి,అరాచకం అంటే బిఆర్ఎస్,బీజేపీ…
– దేశం మెచ్చేలా కాంగ్రెస్ సంక్షేమ పథకాలు…
– ఎన్నికలొస్తేనే బీజేపీ,బిఆర్ఎస్ పార్టీలకు అభివృద్ధి గుర్తుకు వస్తదా?…

జమ్మికుంట/ ఫిబ్రవరి 06(మా అక్షరం):ఎన్నికలు వస్తేనే బిజెపి,బిఆర్ఎస్ పార్టీలకు అభివృద్ధి గుర్తుకు రావడం,ఎన్నికల్లో ఓట్ల కోసం తప్ప అభివృద్ధి చేయాలనే తపన ఆ రెండు పార్టీలకు లేదని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం జమ్మికుంట పట్టణంలో 6,7,8,9,10,11,1,2,3,13,14 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి,కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు.ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు,ప్రణవ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.అనంతరం వోడితల ప్రణవ్ మాట్లాడుతూ… హుజురాబాద్,జమ్మికుంట పట్టణ ప్రజలు ఈ సారి మార్పును కోరుకుంటున్నారనీ,పదేళ్ల తర్వాత అన్ని వర్గాలకు అందుబాటులో సంక్షేమ పథకాలు అమలు చేశామని ఇది పదేళ్లు ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయలేదని విమర్శించారు.12 ఏళ్లుగా ఎంపీ గా ఉన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ 12 ఏళ్లలో తీసుకురాని నిధులు ఇప్పుడు తీసుకొస్తా అనడం విడ్డూరంగా ఉందని అన్నారు.అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం ద్వారా వార్డుల అభివృద్ధి జరుగుతుందని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మికుంట,హుజురాబాద్ పట్టణాలకు 15కోట్లు నిధులు కేటాయించామని,భవిష్యత్ లో రెండు మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని తద్వారాముఖ్యమంత్రి,మంత్రులతో మాట్లాడి మరిన్ని నిధులు తీసుకువస్తామని తెలిపారు.కౌశిక్ రెడ్డికి లొల్లిళ్లు తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదనీ,గతంలో ఎమ్మ్యేల్సి గా ఉన్నప్పుడు,ఇప్పుడు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఏ రోజు అభివృద్ధి గురించి ఆలోచించలేదని అన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని వార్డుల అభ్యర్థులు,పిసిసి సభ్యులు పత్తి కృష్ణారెడ్డి,సాయిని రవి,గుడెపు సారంగపాణి,పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్,సీనియర్ నాయకులు,వార్డ్ కో ఆర్డినేటర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !