+91 99635 77856

బిజెపి తోనే అభివృద్ధి సాధ్యం

Kudikala Sai Editor
maaksharamnews.in

బిజెపి తోనే అభివృద్ధి సాధ్యం

-బిజెపి తోనే అభివృద్ధి సాధ్యం...
- 28వ వార్డు అభ్యర్థి పంజాల రాధాస్వామి...
హుజురాబాద్ /ఫిబ్రవరి 09(మా అక్షరం):
కేంద్రంలో బిజెపి అధికారంలో ఉందని, బిజెపి తోనే హుజురాబాద్ అభివృద్ధి సాధ్యమవుతుందని 28వ వార్డు అభ్యర్థి పంజాల రాధాస్వామి అన్నారు. ఆదివారం నిర్వహించిన ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.... కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డులోని నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తారని తెలిపారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, లేబర్ కార్డులు ఇప్పిస్తానని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్య సదుపాయం కల్పించేందుకు పాటుపడతానని అన్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తానని, వార్డులో కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. డ్రైనేజీల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు చేపడతానని చెప్పారు. ఆయన వెంట 28వ వార్డు బిజెపి పార్టీ ఎన్నికల ఇంచార్జి సముద్రాల సంపత్, బిజెపి నాయకులు, వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు.

Share ePaper Clip

Preparing image...

-బిజెపి తోనే అభివృద్ధి సాధ్యం…
– 28వ వార్డు అభ్యర్థి పంజాల రాధాస్వామి…
హుజురాబాద్ /ఫిబ్రవరి 09(మా అక్షరం):
కేంద్రంలో బిజెపి అధికారంలో ఉందని, బిజెపి తోనే హుజురాబాద్ అభివృద్ధి సాధ్యమవుతుందని 28వ వార్డు అభ్యర్థి పంజాల రాధాస్వామి అన్నారు. ఆదివారం నిర్వహించిన ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ…. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డులోని నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తారని తెలిపారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, లేబర్ కార్డులు ఇప్పిస్తానని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్య సదుపాయం కల్పించేందుకు పాటుపడతానని అన్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తానని, వార్డులో కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. డ్రైనేజీల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు చేపడతానని చెప్పారు. ఆయన వెంట 28వ వార్డు బిజెపి పార్టీ ఎన్నికల ఇంచార్జి సముద్రాల సంపత్, బిజెపి నాయకులు, వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !