+91 99635 77856

అభివృద్ధి కావాలంటే బీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలి

Kudikala Sai Editor
maaksharamnews.in

అభివృద్ధి కావాలంటే బీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలి

-అభివృద్ధి కావాలంటే బీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలి...

- 22వ వార్డు అభ్యర్థి తలకొక్కుల శ్యామల–ప్రసాద్...

హుజురాబాద్ /ఫిబ్రవరి 09 (మా అక్షరం):హుజురాబాద్ అభివృద్ధి బీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని 22వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి తలకొక్కుల శ్యామల–ప్రసాద్ అన్నారు. సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహకారంతో వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.వార్డులో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాకతీయ కాలనీ, ఇస్లాం నగర్ ప్రాంతాల్లో అధ్వాన్నంగా ఉన్న పెద్ద మురికి నీటి కాలువ స్థలంలో వరదనీటి డ్రైనేజీని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అలాగే అవసరమున్న ప్రాంతాల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు.
డ్రైనేజీల పరిశుభ్రత, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. రోడ్లు, వీధిదీపాలు,తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిస్వార్థంగా సేవ చేస్తానని శ్యామల–ప్రసాద్ స్పష్టం చేశారు.అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని, తనను ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.

Share ePaper Clip

Preparing image...

-అభివృద్ధి కావాలంటే బీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలి…

– 22వ వార్డు అభ్యర్థి తలకొక్కుల శ్యామల–ప్రసాద్…

హుజురాబాద్ /ఫిబ్రవరి 09 (మా అక్షరం):హుజురాబాద్ అభివృద్ధి బీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని 22వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి తలకొక్కుల శ్యామల–ప్రసాద్ అన్నారు. సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహకారంతో వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.వార్డులో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాకతీయ కాలనీ, ఇస్లాం నగర్ ప్రాంతాల్లో అధ్వాన్నంగా ఉన్న పెద్ద మురికి నీటి కాలువ స్థలంలో వరదనీటి డ్రైనేజీని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అలాగే అవసరమున్న ప్రాంతాల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు.
డ్రైనేజీల పరిశుభ్రత, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. రోడ్లు, వీధిదీపాలు,తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిస్వార్థంగా సేవ చేస్తానని శ్యామల–ప్రసాద్ స్పష్టం చేశారు.అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని, తనను ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !