+91 99635 77856

మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసులు వాహనాల తనిఖీలు

Kudikala Sai Editor
maaksharamnews.in

మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసులు వాహనాల తనిఖీలు

హుజురాబాద్/ ఫిబ్రవరి 09 (మా అక్షరం): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా పట్టణంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, ప్రవేశ మార్గాలు, రద్దీ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు తదితర వాహనాలను తనిఖీ చేస్తున్నారు.ఈ సందర్భంగా అనుమానాస్పదంగా తరలిస్తున్న నగదు, మద్యం, ఇతర అక్రమ వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు.ఎక్కడైనా ఎన్నికల నియమాలకు విరుద్ధమైన కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !