+91 99635 77856

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 163 BNSS సెక్షన్ అమలు

కరీంనగర్/ ఫిబ్రవరి 09 (మా అక్షరం): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 163 BNSS సెక్షన్‌ (గతంలో 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఫిబ్రవరి 10 ఉదయం 6 గంటల నుండి 12 ఉదయం 6 గంటల వరకు ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !