+91 99635 77856

బిఆర్ఎస్ పార్టీలోకి రవీందర్ రెడ్డి దంపతులు

Kudikala Sai Editor
maaksharamnews.in

బిఆర్ఎస్ పార్టీలోకి రవీందర్ రెడ్డి దంపతులు

హుజురాబాద్/ ఫిబ్రవరి 10 (మా అక్షరం): నియోజకవర్గంలోని హుజురాబాద్ మున్సిపాలిటీ లోని దమ్మక్కపేట చెందిన సీనియర్ నాయుడు రవీందర్ రెడ్డి ,అతని సతీమణి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ కండువా కప్పి బిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందని, ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని విమర్శించారు.తెలంగాణ రైతులకు కనీసం యూరియా కూడా అందించలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల పై అన్ని వర్గాల ప్రజలు విసుగుతో ఉన్నారని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించిందని గుర్తుచేశారు.అదే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా హుజురాబాద్ నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను బిఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని నమ్మకంతో పార్టీ మారాను అని తెలిపారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, రైతుల మన్ననలు పొందుతున్న నాయకుడని పేర్కొన్నారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ధైర్యంగా నిలదీయడమే కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కౌశిక్ రెడ్డితోనే సాధ్యమని విశ్వసించి బిఆర్ఎస్ కండువా కప్పుకున్నామని తెలిపారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !