+91 99635 77856

హుజూరాబాద్ గడ్డపై బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవడం ఖాయం

-హుజూరాబాద్ గడ్డపై బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవడం ఖాయం….
– మతి భ్రమించి,వ్యక్తిగత ఇమేజ్ కోసం అత్యుత్సాహంతో దేవతల సాక్షిగా కౌశిక్ రెడ్డి చిల్లర రాజకీయం….
– మతం పేరుతో కరీంనగర్ సీపీనీ దూషించింది నిజం కాదా?….
– ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ సామెతకు ఉదాహరణ కౌశిక్ రెడ్డి….
– ఎన్నికల ముందు చెప్పాం,చెప్పిన ప్రకారం హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేశాం….
– కౌశిక్ రెడ్డిపై ఉన్న కేసులన్నంటినీ సిఐడితో విచారణ చేయించాలి….
– హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్….
హుజురాబాద్/ ఫిబ్రవరి 28( మా అక్షరం): కొన్ని రోజులుగా కౌశిక్ రెడ్డి వివిధ చానెల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తుంటే అతనికి మతి స్థిమితం పూర్తిగా కోల్పోయినట్టు మెదడు మోకాలిలోకి వచ్చి,వ్యక్తిగత ఇమేజ్ కోసం అధికారులను దూషించడం,ఆపై తన మాటే నెగ్గాలి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడని కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం లేదని,అవన్నీ బోగస్ ముచ్చట్లనీ అన్నారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్.శనివారం హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 98 మంది లబ్ధిదారులకు 36 లక్షల విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను 5 మండలాల పరిధిలోని లబ్ధిదారులకు పంపిణీ చేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మాట్లాడితే కేసులు పెడుతున్నారని అనే కౌశిక్ రెడ్డి తన కేసుల విషయంలో ప్రజల కోసం కోట్లాడితేనో,ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటేనో కేసులు పెట్టలేదని,వ్యాపారస్తులను,ఇక్కడున్న ఇసుక క్వారీల యజమానులను,ప్రతి ఒక్కరిని బెదిరించి అక్రమాలకు పాల్పడితే వారే స్వచ్ఛందంగా పోలీసు స్టేషన్ కి వెళ్లి కేసులు పెట్టారని అన్నారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి,సంక్షేమం సమపాళ్లుగా ప్రజలకు అందిస్తున్నామని,ప్రజా ప్రభుత్వంలో హుజురాబాద్ లో ఏ ఎన్నిక జరిగినా ప్రజల తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని,ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయగా దాన్ని జీర్ణించుకోలేని కౌశిక్ రెడ్డి ఆగం ఆగం అవుతున్నారని అన్నారు.ఇకపై హుజురాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ ఉండదని భూస్థాపితమయ్యిందని అన్నారు.

ముఖ్యమంత్రిపై అనవసరపు వ్యాఖ్యలు చేస్తే సహించం..

పెద్దవారితో పోల్చుకుంటే పెద్దోడైపోతామని కౌశిక్ రెడ్డి పగటి కలలుకంటున్నాడని,ఎన్నికలైన,ఇతర విషయాల్లో దూరి అనవసరపు ఇష్యూలో కలగచేసుకొని తన పరువు పోగొట్టుకోవడమే కాదు హుజురాబాద్ పరువు కూడా తీస్తున్నాడని కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు.ముఖ్యమంత్రిపై ఇంకోసారి చిల్లర వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.కేసీఆర్ బయటికి వస్తే ఏదో అయిపొద్దని చెప్పే కౌశిక్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకు ఫార్మ్ హౌస్ కే పరిమితం అయ్యారని,కేసీఆర్ బయటికి వచ్చిన ఎంపీ ఎన్నికల్లో ప్రజలు గుండు సున్నా ఇచ్చి మళ్ళీ ఫామ్ హౌస్ కే పరిమితం చేశారని గుర్తుచేశారు.పదేళ్లు రాష్ట్రాన్ని చిన్నా బిన్నం చేసి మళ్ళీ అధికారం కోసం వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

పోలీసుల విషయంలో కౌశిక్ రెడ్డి తన ప్రవర్తన మానుకోవాలి..

ఇటీవల వీణవంక సమ్మక్క సారలక్క జాతర విషయంలో పోలీసులపై కౌశిక్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చట్ట ప్రకారం హైకోర్టు ఆదేశాల మేరకు వారు నడుచుకున్నారని,కౌశిక్ రెడ్డి చెప్పినట్టు వినడానికి,నడవడానికి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని,ప్రజా ప్రభుత్వమని అన్నారు.ఒక మహిళ అధికారిని పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై అతని సంస్కారానికే వదిలేస్తున్నామని అన్నారు.మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పోలీసులకు ట్రైనింగ్ ఇస్తా అనడం కాదు ముందుగా మీ కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పలేదా అని ఈ విషయంలో కౌశిక్ రెడ్డి ట్రైనింగ్ తీసుకోవాలని సూచించారు.

మతం పేరుతో కరీంనగర్ సీపీనీ దూషించింది నిజం కాదా?ఈ విషయంపై కేటీఆర్,హరీష్ రావు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలి.

కౌశిక్ రెడ్డి ఒక ముస్లిం అధికారినీ పట్టుకొని కులం పేరుతో దూషించింది నిజం కాదా అని,ఈ విషయంపై కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్,హరీష్ రావు మద్దతు ఇస్తున్నారా అని ప్రశ్నించారు?తక్షణమే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కౌశిక్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ సుహాసిని,వైస్ చైర్మన్ అంజలి,కౌన్సిలర్లు,మార్కెట్ చైర్మెన్ లు,దేవాలయ చైర్మెన్ లు,డైరెక్టర్లు,మండల,పట్టణ అధ్యక్షులు,సీనియర్ నాయకులు,యువజన విభాగం నాయకులు,బ్లాక్ కాంగ్రెస్,మైనారిటీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !