+91 99635 77856

హుజురాబాద్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై దాడులు 22 సిలిండర్లు స్వాధీనం

హుజురాబాద్/ మార్చి 23 (మా అక్షరం): కలెక్టర్, ఆదేశాల మేరకు హుజురాబాద్ పట్టణంలోని వాణిజ్య కేంద్రాలపై సోమవారం అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్‌లు మరియు ఇతర వాణిజ్య సంస్థల్లో డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు గుర్తించారు.తనిఖీలలో భాగంగా మొత్తం 22 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని, వాటిని ఎల్పీజీ గోదాం అధికారులకు సేఫ్ కస్టడీ నిమిత్తం అప్పగించారు. సుమారు 12 హోటల్ సముదాయాల్లో డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు బయటపడ్డాయి.నియమాలను ఉల్లంఘించిన వాణిజ్య సంస్థల యజమానులపై ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం ప్రకారం 6A కేసులు నమోదు చేయాలని నివేదికను కలెక్టర్, సివిల్ సప్లై శాఖ అధికారులకు తదుపరి చర్యల కోసం సమర్పించారు.అధికారులు ఈ సందర్భంగా వాణిజ్య కేంద్రాల యజమానులకు స్పష్టంగా సూచించారు: డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాడకుండా, తప్పనిసరిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే వినియోగించాలని హెచ్చరించారు.తనిఖీలలో పాల్గొన్నవారు సురేందర్ (DTCS, కరీంనగర్), ఉషా (DTCS, గంగాధర), వినోద్ కుమార్ (CSI, హుజురాబాద్), శ్రీనివాస్ రెడ్డి (CSI, కరీంనగర్), అన్వర్‌రావు (CSI, తిమ్మాపూర్), సతీష్ (జూనియర్ అసిస్టెంట్) తదితరులు ఉన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !