హుజురాబాద్ మండలంలోని తెలంగాణ అల్పసంఖ్యాకుల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో (WWF)బీసీఐ ఉత్తమ పత్తి యాజమాన్య పథకం నవ క్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలోEarth Hour (ఎర్త్ అవర్) కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పత్తి యాజమాన్య పథకం అసిస్టెంట్ మేనేజర్ రామారావు గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి నెలలోని ఆఖరి శనివారం ఒక గంట పాటు లైట్లు ఆఫ్ చేయడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలని 2007లో(WWF) World Wide Fund for Nature ఈ కార్యక్రమన్ని నిర్వహించడం జరుగుతుంది.దీని ముఖ్య ఉద్దేశ్యం పర్యావరణ రక్షణ, వాతావరణ మార్పు (Climate Change) గురించి ప్రజల్లోఅవగాహనకల్పించడం.ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజలు, కంపెనీలు, ప్రభుత్వాలు కూడా ఇందులో పాల్గొంటాయని తెలిపారుమార్చి నెల చివరి శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు అందరు స్వచ్చందంగా ఒక గంట పాటుఇంట్లో అవసరం లేని లైట్లు ఆఫ్ చేయలని కుటుంబంతో కలిసి పర్యావరణ పరిరక్షణపై చర్చ చేయాలని,చెట్లు నాటడం, విద్యుత్ ఆదా చేయడం ప్లాస్టిక్వాడకంనివారించాలని నేల ఆరోగ్యానికి కాపాడుకోవడం
వంటివిషయాలుతెలపడంజరిగింది.ఈకార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారు సిబ్బంది మరియు బీసీఐ క్షేత్ర సిబ్బంది పాఠశాల పిల్లలు పాల్గొనడం జరిగింది.












